క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని స్టార్ అయిన సచిన్ టెండూల్కర్... ముంబై వీధుల్లో ఆగమయ్యారు. రూట్ మరిచిపోయి తికమకపడుతున్న తరుణంలో ఓ ఆటోడ్రైవర్... క్రికెట్ దేవుడికి దారి చూపాడట. ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నాడు సచిన్ టెండూల్కర్. 10 నెలల క్రితం 2020 జనవరిలో సచిన్ టెండూల్కర్ ముంబైలోని సబర్బన్ వీధుల్లో ప్రయాణిస్తూ ఓ గల్లీలోకి ఎంటర్ అయ్యాడట.

ఆ గల్లీలో నుంచి బయటికి ఎలా రావాలో తెలియక కంఫ్యూజ్ అయ్యాడట సచిన్. గూగుల్ మాప్స్‌లో కూడా మెయిన్ రోడ్డుకి దారి కనిపించలేదట. అప్పుడు అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్... సచిన్ పరిస్థితి తెలుసుకుని సాయం చేశాడట.

డ్రైవరన్న సూచనతో మెయిన్ రోడ్డు వరకూ ఆటోను ఫాలో అయిన సచిన్ టెండూల్కర్... రోడ్డు మీదకి వచ్చాక అతనితో ఓ సెల్ఫీ తీసుకున్నాడు. ఆ వీడియోను 10 నెలల తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేశాడు సచిన్ టెండూల్కర్. 

‘టెక్నాలజీ మనకి చాలా సాయం చేస్తోంది. కానీ సాటి మనిషి చేసే సాయం ముందు అవన్నీ చిన్నవే. దారి తెలియక సతమతమవుతున్న సమయంలో నాకు ఈ జెంటిల్మెన్, ఆటో డ్రైవర్ మంగేశ్ సాయం చేశాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు సచిన్ టెండూల్కర్.