Asianet News TeluguAsianet News Telugu

RRvsSRH: బౌలింగ్ అదుర్స్... భారీ స్కోరు చేయలేకపోయిన రాజస్థాన్ రాయల్స్...

36 పరుగులు చేసిన సంజూ శాంసన్.. 30 పరుగులు చేసిన బెన్‌స్టోక్స్...

మూడు వికెట్లు తీసిన జాసన్ హోల్డర్... 

 

RR vs SRH: Sunrisers Hyderabad bowlers restricted RR for average score CRA
Author
India, First Published Oct 22, 2020, 9:15 PM IST

IPL 2020: టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. 13 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన ఓపెనర్ రాబిన్ ఊతప్ప... రనౌట్ అయ్యాడు.

అయితే వరుసగా విఫలం అవుతున్న సంజూ శాంసన్, బెన్‌స్టోక్స్ కలిసి రెండో వికెట్‌కి 56 పరుగులు జోడించారు. 32 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసి బెన్‌స్టోక్స్, 26 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 36 పరుగులు చేసి సంజూ శాంసన్ అవుట్ అయ్యారు. 

జోస్ బట్లర్ 9 పరుగులకే పెవిలియన్ చేయగా... స్టీవ్ స్మిత్ 19 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ 20, ఆర్చర్ 16 పరుగులు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జాసన్ హోల్డర్ మూడు, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ తలా ఓ వికెట్ తీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios