Asianet News TeluguAsianet News Telugu

RRvsMI: హార్దిక్ పాండ్యా సిక్సర్ల మోత... భారీ స్కోరు చేసిన ముంబై ఇండియన్స్...

40 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్... 37 పరుగులు చేసిన ఇషాన్ కిషన్...

మెరుపులు మెరిపించిన సౌరబ్ తివారీ, హార్ధిక్ పాండ్యా...

RR vs MI: Hardik, Tiwary Sixes innings helped Mumbai Indians to score big total CRA
Author
India, First Published Oct 25, 2020, 9:14 PM IST

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఓపెనర్ డి కాక్ 6 పరుగులకే అవుట్ కాగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కలిసి రెండో వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఇషాన్ కిషన్ 36 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో 37 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో 40 పరుగులు చేశాడు. కిరన్ పోలార్డ్ 6 పరుగులు చేసి అవుట్ కావడంతో 11 పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్... అయితే హార్ధిక్ పాండ్యా, సౌరబ్ తివారి కలిసి మెరుపులు మెరిపించారు. 

25 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో 34 పరుగులు చేసిన సౌరబ్ తివారి, ఆర్చర్ బౌలింగ్‌లో అవుట్ కాగా... 21 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు హార్ధిక్ పాండ్యా...రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆర్చర్, శ్రేయాస్ గోపాల్ రెండు, కార్తీక్ త్యాగి ఓ వికెట్ తీశాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios