ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి.. రాజ‌స్థాన్ కు బిగ్ షాక్

Tata IPL 2024 : ఐపీఎల్ 2024 లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు బిగ్ షాక్ త‌గిలింది. లీగ్ రౌండ్ చివరి మ్యాచ్ లో విజయంపై ఆశతో రాజస్థాన్ రాయల్స్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టగా.. వర్షం ఆ జట్టు ఆశలపై నీళ్లు చ‌ల్లింది. 
 

RR vs KKR IPL 2024: This is the second time in the history of IPL. Big shock for Rajasthan RMA

Tata IPL 2024 : ఐపీఎల్ 2024 ఆరంభం నుంచే అద‌ర‌గొడుతూ టాప్ ప్లేస్ లో కొన‌సాగుతూ వ‌చ్చిన రాజస్థాన్ రాయ‌ల్స్ టీమ్ కు ప్లేఆఫ్స్ మ్యాచ్ ల‌కు ముందు త‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో వెనుక‌ప‌డింది. అయితే, ఈ టీమ్ టాప్-4 లో చోటుద‌క్కించుకుంది. లీగ్ రౌండ్ చివరి మ్యాచ్ లో విజ‌యం ద‌క్కించుకుని రెండో ప్లేసులో నిల‌వాల‌ని చూసింది. కానీ, ఆ జ‌ట్టు ఆశల‌పై వ‌ర్షం నీళ్లు చ‌ల్లింది. సంజూ శాంసన్ సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవడానికి కీల‌క‌మైన కోల్ క‌తాతో చివ‌రి లీగ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా టాస్ ప‌డిన త‌ర్వాత ర‌ద్దు అయింది. ఇలా ఐపీఎల్ చరిత్రలో టాస్ తో మ్యాచ్ రద్దవడం ఇది రెండోసారి.

వ‌ర్షంతో టాస్ ఆల‌స్యం.. ర‌ద్దు.. 

ఐపీఎల్ 2024 70వ మ్యాచ్ లో  రాజస్థాన్, కేకేఆర్ జట్ల మధ్య రాత్రి 7 గంటలకు టాస్ జరగాల్సి ఉంది. కానీ, వ‌ర్షం కార‌ణంగా టాస్ ఆల‌స్యం అయింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో టాస్ కోసం మూడున్నర గంటలకు పైగా నిరీక్షించారు. రాత్రి 10:35 గంట‌ల త‌ర్వాత వర్షం త‌గ్గ‌డంతో టాస్ ప‌డింది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సమయంలో 7-7 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. అయితే ఆటగాళ్లు మైదానానికి రాబోతున్న సమయంలో మ‌ళ్లీ వర్షం ప‌డ‌టం మొద‌లైంది. భారీ వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ జ‌రిగే ప‌రిస్థితులు క‌నిపించ‌లేదు. దీంతో టాస్ అనంతరం మ్యాచ్ ను రద్దు చేశారు. ఐపీఎల్ 2012 త‌ర్వాత టాస్ ప‌డి మ్యాచ్ ర‌ద్దు కావ‌డం ఇదే తొలిసారి.

నా ఆట గురించి నాకు తెలుసు.. ఎవ‌రికీ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు : విరాట్ కోహ్లీ

2012లో ఒక తొలిసారి టాస్ ప‌డిన త‌ర్వాత మ్యాచ్ రద్దయింది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ ప‌డ్డాయి. హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుందని అభిమానులు ఆశించారు కానీ వర్షం దెబ్బ‌కు మ్యాచ్ ర‌ద్దు అయింది. దీని త‌ర్వాత ఇప్పుడు అంటే 12 ఏళ్లలో టాస్ తర్వాత మ్యాచ్ రద్దవడం ఇది రెండోసారి. 

కేకేఆర్, హైదరాబాద్ మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్

ఐపీఎల్ 2024 లో లీగ్ రౌండ్ మ్యాచ్ లు ముగిశాయి. మార్చి 21న క్వాలిఫయర్-1లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్, స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం జ‌రిగిన‌ మ్యాచ్ లో పంజాబ్ ను ఓడించిన హైదరాబాద్ జట్టు రెండో స్థానాన్ని కైవసం చేసుకుని రాజస్థాన్ ను మూడో స్థానానికి నెట్టింది. దీంతో ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీతో రాజస్థాన్ తో తలపడనుంది. ఇరు జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. గెలిచిన జ‌ట్టు ఐపీఎల్ టైటిల్ రేసులో నిల‌వ‌డానికి అవ‌కాశాలు ఇంకా ఉంటాయి.

SRH vs PBKS: అభిషేక్ శ‌ర్మ దెబ్బ‌కు బౌల‌ర్లు బెంబేలెత్తిపోయారు.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios