RCB vs RR : ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రోవ్‌మన్ పావెల్ సూపర్ మ్యాన్ లా గాల్లోకి ముందుకు దూకి స్టన్నింగ్స్ క్యాచ్ తో ఫాఫ్ డుప్లెసిస్ ను పెవిలియన్ కు పంపాడు.
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్ ను కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీలు ప్రారంభించారు. మరోసారి వీరిద్దరూ బెంగళూరుకు శుభారంభం అందించారు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ హిస్టరీలో 8000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా ఘనతను అందుకున్నాడు.
కింగ్ కోహ్లీ 32 పరుగులు వద్ద ఈ రికార్డును అందుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ లో కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మంచి ఫామ్ లో కనిపించారు. మ్యాచ్ ప్రారంభంలో బౌలర్లకు పిచ్ అనుకూలించడంతో బౌండరీలు సాధించడానికి కష్టపడ్దారు. ఈ క్రమంలోనే డుప్లెసిస్ భారీ షాట్ కొట్టబోయి క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. 5వ ఓవర్ 4వ బంతికి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో భారీ షాక్ కొట్టాడు డుప్లెసిస్.. బౌండరీ లైన్ వద్ద ఉన్న రోవ్‌మన్ పావెల్ సూపర్ మ్యాన్ లా ముందుకు దూకి అద్భుతమైన డైవ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ కళ్లు చెదిరే క్యాచ్ ఐపీఎల్ హిస్టరీలో మరో బెస్ట్ క్యాచ్ గా నిలిచింది. దీంతో ఫాఫ్ డుప్లెసిస్ 17 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. రోవ్‌మన్ పావెల్ అందుకున్న ఈ క్యాచ్ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
