Asianet News TeluguAsianet News Telugu

Rohit Sharma: భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. కివీస్ టూర్ నుంచి బాధ్యతలు

భారత (team india) టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ (rohit sharma) నియమితులయ్యారు. వైఎస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను (kl rahul) నియమిస్తూ బీసీసీఐ (bcci) మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే 20 టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి కోహ్లీ (virat kohli) తప్పుకున్న సంగతి తెలిసిందే. 

Rohit Sharma to be named T20 captain
Author
Mumbai, First Published Nov 9, 2021, 5:21 PM IST

భారత (team india) టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ (rohit sharma) నియమితులయ్యారు. వైఎస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను (kl rahul) నియమిస్తూ బీసీసీఐ (bcci) మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే 20 టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి కోహ్లీ (virat kohli) తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 17 నుంచి డిసెంబర్ 7 వరకు న్యూజిలాండ్ (newzealand)- భారత్ జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌లకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు. కివీస్‌తో 3 టీ20లు , 2 టెస్టులు ఆడనుంది టీమిండియా. 

మరోవైపు విరాట్‌ కోహ్లి న్యూజిలాండ్‌తో జరగనున్న టి20 సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. అయితే తర్వాతి రెండు టెస్టుల్లో మాత్రం కోహ్లి ఆడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు కూడా రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముందని సమాచారం. అయితే టెస్టుల్లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న అజింక్యా రహానేకే (ajinkya rahane) తొలి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. టి20 ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలమైన హార్దిక్‌ పాండ్యా (hardik pandya), వరుణ్‌ చక్రవర్తిలపై (varun chakravarthy) వేటు పడే అవకాశం కనిపిస్తోంది. 

ALso Read:Virat Kohli: ఒక శకం ముగిసింది.. కెప్టెన్, కోచ్ గా విరాట్ కోహ్లి-రవి శాస్త్రిల రికార్డులివే..

అటు న్యూజిలాండ్‌ సిరీస్‌కు జస్‌ప్రీత్‌ బుమ్రా (jasprit bumrah), మహ్మద్‌ షమీలు (mohammed shami) కూడా దూరంగా ఉండే అవకాశమున్నట్లు సమాచారం. అయితే టి20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వరుణ్‌ చక్రవర్తి స్థానంలో ఐపీఎల్‌ 2021 పర్పుల్‌ క్యాప్‌ గెలిచిన హర్షల్‌ పటేల్‌కు (harshal patel) అవకాశం ఇచ్చే యోచనలో బీసీసీఐ వుందని తెలుస్తోంది. ఇక టి20 ప్రపంచకప్‌కు టీమిండియా రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఉన్న దీపక్‌ చహర్‌ (deepak chahar) , శ్రేయాస్‌ అయ్యర్‌లు (shreyas iyer) తుది జట్టులో చోటు దక్కే అవకాశమున్నట్లు తెలిసింది. చహల్‌ విషయమై బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే నవంబర్‌ 17, 19, 21వ తేదీల్లో మూడు టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక నవంబర్‌ 25-29 వరకు కాన్పూర్‌ వేదికగా తొలి టెస్టు, డిసెంబర్‌ 3-7 వరకు ముంబై వేదికగా రెండో టెస్టు జరగనుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios