హామిల్టన్: న్యూజిలాండ్ బౌలర్ హమీష్ బెన్నెట్ కు ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చుక్కలు చూపించాడు. బెన్నెట్ వేసిన ఆరో ఓవరులో రోహిత్ శర్మ 27 పరుగులు పిండుకున్నాడు. ఆరో ఓవరు తొలి బంతికి కేఎల్ రాహుల్ సింగిల్ తీశాడు. రోహిత్ శర్మకు స్ట్రైక్ ఇచ్చాడు. 

ఆ తర్వాతి ఐదు బంతులను రోహిత్ శర్మ ఉతికి ఆరేశాడు. బెన్నెట్ రెండో బంతిని రోహిత్ శర్మ బౌండరీ ఆవలికి పంపించి ఆరు పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి బంతిని లాంగ్ ఆఫ్ మీదుగా సిక్శ్ బాదాడు. దాంతో బెన్నెట్ లైన్ మార్చుకుని వైడ్ యార్కర్ నుంచి సంధించాడు. దాన్ని రోహిత్ శర్మ బౌండరీగా మలిచాడు. 
also Read: కివీస్ వర్సెస్ ఇండియా: ఓపెనర్ గా రోహిత్ శర్మ మరో రికార్డు

ఆ తర్వాత కూడా అదే వైడ్ యార్కర్ ను బెన్నెట్ వేశాడు. దాన్ని కూడా అదే పద్ధతిలో రోహిత్ బౌండరీ అవలికి తరలించాడు. చివరి బంతిని బెన్నెట్ అద్భుతంగానే సంధించాడు. అయితే జోరు మీదున్న రోహిత్ శర్మ ఆ బంతిని బౌలర్ పై నుంచి కొట్టి ఆరు పరుగులు రాబట్టుకున్నాడు. తద్వారా రోహిత్ శర్మ ఒక్క ఓవరులో26 పరుగులు రాబట్టగా, బెన్నెట్ ఒక్క ఓవరులో 27 పరుగులు సమర్పించుకున్నాడు. 

రోహిత్ శర్మ ఆటతీరు చూస్తే అతను భారీ స్కోరు సాధించడానికి సమాయత్తమైనట్లు కనిపించాడు. 92 పరుగుల స్కోరు వద్ద కేఎల్ రాహుల్ తొలి వికెట్ గా పెవిలియన్ చేరుకోగా,  ఆ తర్వాత కొద్దిసేపటికే రోహిత్ శర్మ అవుటయ్యాడు.  

Also Read: కివీస్ వర్సెస్ ఇండియా: ధోనీని దాటేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ