Asianet News TeluguAsianet News Telugu

కివీస్ వర్సెస్ ఇండియా: ధోనీని దాటేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ

న్యూజిలాండ్ పై మూడో టీ20 సందర్భంగా విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్ గా అతను రికార్డు సృష్టించాడు.

3rd T20I: Virat Kohli overtakes MS Dhoni in list of most runs scored by captains in T20Is
Author
Hamilton, First Published Jan 29, 2020, 2:56 PM IST

హామిల్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. కెప్టెన్ గా టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును విరాట్ కోహ్లీ సృష్టించాడు. ఈ క్రమంలో భారత లెజెండ్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు.

హామిల్టన్ లో న్యూజిలాండ్ పై జరుగుతున్న మూడో టీ20 మ్యాచులో విరాట్ కోహ్లీ ఆ రికార్డును సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్లలో అతను మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ పై జరిగిన తొలి టీ20లో కోహ్లీ 45 పరుగులు, రెండో టీ20లో 11 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ధోనీని దాటేయడానికి మరో 25 పరుగులు చేయాల్సి ఉండగా, దాన్ని మూడో టీ20లో పూరించాడు. 

Also Read: మూడో టీ20లో మూడు: కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు

కెప్టెన్లుగా ఆత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్ర,స్థానంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ పాఫ్ డూ ప్లెసిస్ ఉన్నాడు. అతను 1273 పరుగులు చేశాడు. రెండో స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉన్నాడు. ఇతను 1,11 పరుగులు చేశాడు. 

కెప్టెన్లలో అత్యంత వేగంగా 11 వేల పరుగులు మైలురాయి చేరుకున్న రికార్డు ఇప్పటికే కోహ్లీ ఖాతాలో ఉంది. ఆస్ట్రేలియాపై జరిగిన సిరీస్ లో అతను ఈ ఘనత సాధించాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios