Rohit Sharma: "పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాం"

Rohit Sharma: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత జట్టు 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా  ఫ్లాప్‌ అయ్యింది.  మ్యాచ్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశకు లోనయ్యాడు.

Rohit Sharma says We failed to exploit conditions with the ball and batted poorly KRJ

Rohit Sharma: దక్షిణాఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలనే టీమిండియా కల చెదిరింది. దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేనకు గట్టి షాక్ తగిలింది. ఆతిథ్య జట్టు కేవలం 3 రోజుల్లోనే ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి సిరీస్‌లో 1-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు 163 పరుగుల భారీ ఆధిక్యాన్ని నిలిపింది. అనంతరం సఫారీ జట్టు విధ్వంసకర బౌలింగ్‌తో టీమిండియాను కట్టుదిట్టం చేసింది. 32 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది అతిథ్య జట్టు.

దక్షిణాఫ్రికాలో మరోసారి టెస్టు సిరీస్‌ గెలవాలన్న భారత జట్టు నిరంతర ఆశ నెరవేరలేదు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ప్రధానంగా బ్యాటింగ్‌ లో విఫలం కావడంతో భారత్‌ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా కూడా తెరవలేకపోయింది. జట్టు ఘోర పరాజయం తర్వాత కెప్టెన్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు.

రోహిత్ శర్మకు షాక్ 

ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత.. తొలిసారిగా ఆడినా మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో నిరాశాజనక ఓటమిని చవిచూశాడు. మ్యాచ్ ప్రారంభానికి ఒక్కరోజు ముందు అతను విజయంపై ప్రగల్భాలు పలికాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ఏ భారత కెప్టెన్ సాధించని విజయాన్ని తాను సాధిస్తానని కెప్టెన్ రోహిత్ చెప్పాడు. సెంచూరియన్ టెస్టు ఓటమితో ఈ కల నెరవేరలేదు.

ఓటమి తర్వాత రోహిత్ ఏమన్నారంటే..? 

ఓటమి అనంతరం కెప్టెన్ మాట్లాడుతూ.. తమ జట్టు ఐక్యంగా రాణించడంలో విఫలమైందని చెప్పాడు. మా ఆట విజయానికి దారితీసే తరహాలో లేదని రోహిత్ అన్నాడు. మొదట బ్యాటింగ్ చేయమని కోరినప్పుడు, మేము పరిస్థితులకు అనుగుణంగా ఆడలేదు. కేఎల్ రాహుల్ బాగా బ్యాటింగ్ చేసినా రెండో ఇన్నింగ్స్‌లో కూడా మాకు బ్యాటింగ్‌లో శుభారంభం లభించలేదు. టెస్టు మ్యాచ్‌లో గెలవాలంటే జట్టు మొత్తం ఐక్యంగా రాణించాల్సి ఉంటుంది. కానీ.. అలా చేయలేకపోయామని అన్నారు. 

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటర్లు సరిగా బ్యాటింగ్ చేయలేదని, బౌలర్లు కూడా పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారని రోహిత్ చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ పేలవంగా ఉంది. విరాట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, కానీ, టెస్టులు గెలవాలంటే, సమిష్టిగా కలిసి రాణించాలి.అలా చేయడంలో విఫలమయ్యాము. మా బ్యాటర్లు వేర్వేరు సమయాల్లో సవాళ్లను ఎదుర్కొన్నారు. సరిగ్గా ఆడలేకపోయాం. మేం రెండు ఇన్నింగ్స్ ల్లోనూ బ్యాటింగ్ సరిగా చేయలేదు, అందుకే మేము నిలబడలేకపోయాం” అని రోహిత్ అన్నారు. సెంచూరియన్‌లో భారీ విజయంతో, 2-మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రోటీస్ 1-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. రెండో (చివరి) టెస్టు జనవరి 3, 2024 నుండి కేప్‌టౌన్‌లో జరగనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios