Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ శ‌ర్మ‌-హార్దిక్ పాండ్యాల‌ మ‌ధ్య ముంబై చిచ్చు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో.. !

Rohit Sharma-Hardik Pandya: హార్దిక్ పాండ్యా-రోహిత్ శర్మల మ‌ధ్య స‌రికొత్త వార్ మొద‌లైంది. ముఖ్యంగా హార్దిక్  ముంబయి ఇండియన్స్‌కు ట్రేడ్ అయినప్పటి నుంచి క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ న‌డుస్తోంది. రోహిత్-హార్దిక్ ల మ‌ధ్య దూరం పెరుగుతుండ‌టంతో క్రికెట్ వ‌ర్గాల్లో టెన్ష‌న్ నెల‌కొంది.
 

Rohit Sharma, Hardik Pandya unfollow each other on Instagram Rohit Hardik Fight on Mumbai Indians RMA
Author
First Published Feb 9, 2024, 5:25 PM IST | Last Updated Feb 9, 2024, 5:25 PM IST

Rohit Sharma - Hardik Pandya Fight: టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ (ఎంఐ)లోకి ట్రేడ్ అయిన‌ప్ప‌టి నుంచి క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు పెట్టిన చిచ్చుతో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల‌ మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఐపీఎల్ ఎంట్రీతోనే హార్దిక్ పాండ్యా నాయ‌క‌త్వంలోని గుజ‌రాత్ టైటాన్స్ టైలిల్ గెలిచింది. ఆ త‌ర్వాతి సీజ‌న్ లో ర‌న్న‌ర‌ఫ్ గా నిలిచింది. గుజ‌రాత్ టైటాన్స్ జట్టును వరుసగా రెండు ఐపీఎల్ ఫైనల్స్ కు తీసుకెళ్లిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియ‌న్స్.. ఐదుసార్లు ముంబై జ‌ట్టును ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించింది. రోహిత్ శ‌ర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీని అప్ప‌గించింది.

కెప్టెన్సీ మార్పునకు గల కారణాలను ముంబై టీమ్ కోచ్ మార్క్ బౌచర్ ఇటీవల వివరించినప్పటికీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రోహిత్ సతీమణి రితికా సజ్దే కూడా కోచ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఈ ఇద్ద‌రు స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌-హార్దిక్ పాండ్యాలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్ర‌మంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ వార్తలు ఆసక్తికరంగా మారాయి. కొంత‌మంది ఎక్స్ యూజ‌ర్లు.. ఈ ఇద్ద‌రు స్టార్ ప్లేయ‌ర్లు  ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో కాలేద‌ని చెప్ప‌గా, మ‌రికొంత మంది హార్దిక్ పాండ్యా రోహిత్ శ‌ర్మ‌ను ఫాలో అవడం మానేశాడని పేర్కొన్నారు. దీంతో మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రు స్టార్ల కోసం వారివారి అభిమానులు ట్వీట్ల‌తో త‌మ స‌పోర్టును తెలుపుతున్నారు.

అందులో నిజం లేదు.. విరాట్ కోహ్లీకి క్షమాప‌ణ‌లు చెప్పిన ఏబీ డివిలియర్స్.. ! 

ఇదిలావుండ‌గా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడం మేనేజ్మెంట్ వ్యూహాత్మక ఎత్తుగడ అని ముంబై టీమ్ కోచ్ మార్క్ బౌచర్ పేర్కొన్నారు. ఇది క్రికెట్ నిర్ణయమే అయినప్పటికీ రోహిత్ శర్మ ఆ పదవిని కోల్పోయినప్పుడు ప్రజలు కలత చెందాల్సిన అవసరం లేదంటూ రోహిత్ శ‌ర్మ నాయకత్వంపై ప్ర‌శంస‌లు కురిపించాడు. "ఇది పూర్తిగా క్రికెట్ నిర్ణయమని నేను అనుకుంటున్నాను. హార్దిక్ ను తిరిగి ఆటగాడిగా తీసుకురావడానికి విండో పీరియడ్ చూశాం. నాకు, ఇది పరివర్తన దశ. భారతదేశంలో చాలా మందికి అర్థం కాదు, ప్రజలు చాలా భావోద్వేగానికి గురవుతారు, కానీ ఇది కేవ‌లం క్రికెట్ మాత్ర‌మే.. " అని వ్యాఖ్యానించాడు. రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన వ్య‌క్తి అనీ, అత‌ను టీమిండియాకు కెప్టెన్ గా ఉంటూ ప్ర‌స్తుతం బిజీగా ఉన్నాడ‌ని పేర్కొన్నాడు. అయితే, రోహిత్ శ‌ర్మ భార్య రితికా సజ్దే కోచ్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

DAVID WARNER: మూడు ఫార్మాట్ల‌లో సెంచరీ .. 3వ క్రికెట‌ర్‌గా వార్న‌ర్ భాయ్ స‌రికొత్త‌ రికార్డు !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios