సరిగ్గా ఇదే రోజు 2014లో రోహిత్ శర్మ... మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. వన్డే అంతర్జాతీయ మ్యాచుల్లో వ్యక్తిగత స్కోరు లో వీరేంద్ర సెహ్వాగ్ పేరిట 219 పరుగుల రికార్డు ఉండగా... దానిని 2014లో రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ ఈ రికార్డు చేశాడు. రోహిత్ ఈ మ్యాచ్ లో 264 పరుగులు చేయడం విశేషం.

2011లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్... వన్డే మ్యాచుల్లో అత్యధిక స్కోర్  219 పరుగులు చేశాడు. అప్పటి వరకు భారత క్రికెటర్లలో వన్డే మ్యాచుల్లో వ్యక్తిగత స్కోర్ అంత  చేసింది ఎవరూ లేరు. అప్పుడు సెహ్వాగ్ ఆ రికార్డు క్రియేట్  చేయగా... 2014లో దానిని రోహిత్ శర్మ సునాయాసంగా చేధించాడు. సరిగ్గా ఇదే రోజు ఆ రికార్డుని రోహిత్ శర్మ బ్రేక్ చేయడం గమనార్హం.

 

వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో డబుల్ సెంచరీలు చేసిన ఘనత కూడా రోహిత్ శర్మకే దక్కింది. 2013లో రోహిత్ శర్మ బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్ లో 209 పరుగులు చేశాడు. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 208 పరుగులు చేశాడు. 

AlsoRead మూడు రోజుల్లో మరో హ్యాట్రిక్ కొట్టిన దీపక్ చాహర్...

కాగా.. 2014లో రోహిత్ రికార్డును ఐసీసీ ఈ రోజు గుర్తు చేసుకుంది. ఈ విషయాన్ని ఐసీసీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఇదిలా ఉండగా... రోహిత్ శర్మ ఇప్పటి వరకు టెస్టు మ్యాచుల్లో  2114 పరుగులు  చేయగా... వన్డే అంతర్జాతీయ మ్యాచుల్లో 8686 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో 2539 పరుగులు చేశాడు.