టీమిండియా యువ క్రికెటర్ దీపక్ చాహర్ మరో హ్యాట్రిక్ సాధించాడు. ఇటీవల నాగ్ పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో తన అద్భుత ప్రదర్శనతో చాహర్ అందరి చూపు తనవైపు చుట్టుకున్నాడు. తన స్వింగ్ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. 

అంతర్జాతీయ టీ-20ల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాక.. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా మరో హ్యాట్రిక్ సాధించాడు. మూడు రోజుల వ్యవధిలో చాహర్ మరో హ్యాట్రిక్‌తో ప్రత్యర్థులకు షాక్ ఇచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 ట్రోఫీలో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న అతను తిరువనంతపురం వేదికగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. 

Also Read:sourav ganguly: గంగూలీ పదవీ కాలం పొడిగించనున్నారా..?

అతని వేసిన 13వ ఓవర్‌లో దర్శన్ నల్కడే, శ్రీకాంత్ వాగ్, అక్షయ్ వాడ్కర్ వికెట్లను వరుస బంతుల్లో తీసుకున్నాడు. దీంతో 13 ఓవర్ల మ్యాచ్‌లో విదర్భ 9 వికెట్లు కోల్పోయి.. 99 పరుగులు చేసింది. చాహర్ 18 పరుగులు ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విదర్భ విజేడీ పద్ధతిలో ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

నాగ్‌పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20 నుంచి దీపక్ చాహర్ పేరు మారుమోగిపోతోంది. కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలతో పాటు హ్యాట్రిక్ వికెట్లు తీసిన చాహర్ టీమిండియా సిరీస్‌ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకున్నాడు.

అయితే లక్ష్యఛేదన సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో మిథున్, నయిమ్ విజృంభించడంతో ఒక దశలో పర్యాటక జట్టు పటిష్ట స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని చాహర్‌కు అప్పగించాడు.

Also Readధోనీ వల్లే ఇదంతా... ఆనందంలో మునిగితేలుతున్న చాహర్ తండ్రి

ఈ సమయంలో రోహిత్ అతనికి ఒకే ఒక్క విషయం చెప్పాడట. ‘‘కీలక ఓవర్లలో నువ్వు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ్టీకి నువ్వే మా బుమ్రావి అని చెప్పడంతో.. ఆ మాటలే తనలో స్ఫూర్తిని కలిగించాయని దీపక్ చెప్పాడు.