కేప్ టౌన్ టెస్టు తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ... కొత్త టెస్టు సారథిగా రోహిత్ శర్మ...
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియమితుడయ్యాయి. ఈ వయసులో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ తీసుకోవడానికి రోహిత్ శర్మ అంగీకరించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైనా, ప్రయోగాలకు పోకుండా హిట్ మ్యాన్‌కే టెస్టు సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
టీమిండియాకి అత్యధిక టెస్టు విజయాలు అందించిన సారథిగా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా టూర్‌లో కేప్ టౌన్ టెస్టు ముగిసిన తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే...
విరాట్ కోహ్లీ నుంచి టెస్టు సారథ్య బాధ్యతలు రోహిత్ శర్మ తీసుకోగా, వైస్ కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రాని ఎంపిక చేశారు సెలక్టర్లు. రోహిత్ శర్మ గైర్హజరీలో సౌతాఫ్రికా టూర్‌లో వైస్ కెప్టెన్‌గా, కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్‌ను అతి త్వరగానే ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు బీసీసీఐ సెలక్టర్లు...
సౌతాఫ్రికా టూర్‌లో కెఎల్ రాహుల్ జట్టును నడిపించిన విధానంలో కెప్టెన్సీ స్కిల్స్ ఏ మాత్రం కనిపించకపోవడంతో అతన్ని ఆ పదవి నుంచి తప్పించి, జస్ప్రిత్ బుమ్రాకి వైస్ కెప్టెన్సీ అప్పగించినట్టు తెలుస్తోంది...
గత మూడు నెలల కాలంలో టీమిండియాకి నాలుగో వైస్ కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా. నవంబర్‌లో జరిగిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్ నుంచి ఏకంగా నలుగురు ప్లేయర్లు వైస్ కెప్టెన్లుగా మారడం విశేషం. అజింకా రహానే పూర్ పర్ఫామెన్స్ కారణంగా ఆ పదవి నుంచి తప్పించిన బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ, ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. అయితే సఫారీ టూర్‌కి ముందు రోహిత్ శర్మ గాయపడడంతో అతని స్థానంలో కెఎల్ రాహుల్‌కి టెస్టు వైస్ కెప్టెన్సీ దక్కింది...
కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా తీవ్రంగా నిరాశపరచడంతో తాజాగా శ్రీలంక టూర్‌లో జస్ప్రిత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉండడంతో ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో ఉన్న అతను, ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాతే లంక సిరీస్‌లో ఆడేది? లేనది తేలనుంది.
టెస్టు సీనియర్ ప్లేయర్లు అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బిజీగా ఉండడంతో ఆ ఇద్దరినీ లంకతో సిరీస్‌కి దూరంగా పెట్టింది బీసీసీఐ. వారి స్థానంలో ప్రియాంక్ పంచల్‌కి మరోసారి పిలుపు రాగా శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుబ్‌మన్ గిల్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నారు.
కుల్దీప్ యాదవ్‌ను మరోసారి టెస్టు సిరీస్‌కి ఎంపిక చేసిన సెలక్టర్లు, సౌరబ్ కుమార్‌కి అవకాశం కల్పించారు. గాయం కారణంగా మూడు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న రవీంద్ర జడేజా, టెస్టు సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రిత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరబ్ కుమార్
