ఈ ఓటమితో టీమ్ కృంగిపోయింది! వాళ్లను చూస్తుంటే చాలా బాధగా ఉంది... - హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్

రోహిత్ శర్మ చాలా గొప్ప లీడర్. అతను టీమ్ కోసం ఎంతో చేశాడు. అయితే ఫైనల్‌లో అనుకున్న రిజల్ట్ మాత్రం రాలేదు.. కోచ్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో వాళ్ల ఏడుపులు, బాధ చూడలేకపోతున్నా... - హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్

Rohit Sharma and team totally disappointed, Team India head coach Rahul Dravid on icc world cup 2023 final CRA

ఒకే ఒక్క మ్యాచ్.. అంతకుముందు గెలిచిన 10 మ్యాచుల కష్టాన్ని పూర్తిగా తుడిచి పెట్టేసింది. లీగ్ స్టేజీలో ప్రతీ టీమ్‌పై తిరుగులేని డామినేషన్ చూపించిన భారత జట్టు, సెమీ ఫైనల్‌లోనూ న్యూజిలాండ్‌ని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఫైనల్‌లో మాత్రం ఆస్ట్రేలియా ముందు ఒత్తిడికి లోనై, చిత్తుగా ఓడింది..

2023 టోర్నీలో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు, అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్, అత్యధిక క్యాచులు అందుకున్న వికెట్ కీపర్.. ఇలా ఎన్నో రికార్డులు భారత జట్టు పేరిటే ఉన్నాయి. అయితే ఫైనల్‌ ఎగ్జామ్‌లో సత్తా చాటిన ఆస్ట్రేలియా,  వరల్డ్ కప్ ఎగరేసుకుపోయింది..

‘ఫైనల్ మ్యాచ్‌ని కూడా చాలా పాజిటివ్‌గా మొదలెట్టాం. పవర్ ప్లేలో 80 పరుగులు వచ్చేశాయి. అయితే కొన్ని వికెట్లు పడిన తర్వాత భాగస్వామ్యాన్ని నిర్మించాల్సి ఉంటుంది. మేం మరీ డిఫెన్సివ్‌గా ఆడలేదు కానీ, ఆస్ట్రేలియా బౌండరీలను నియంత్రించడంలో సూపర్ సక్సెస్ అయ్యింది.

రోహిత్ శర్మ చాలా గొప్ప లీడర్. అతను టీమ్ కోసం ఎంతో చేశాడు. అయితే అనుకున్న రిజల్ట్ మాత్రం రాలేదు. కొన్ని నెలలుగా కష్టపడి, టీమ్‌లో నిర్మించిన హెల్తీ వాతావరణం ఇప్పుడు ఒక్క మ్యాచ్‌తో పాడైంది. రోహిత్ అండ్ టీమ్ చాలా నిరుత్సాహపడ్డారు..

కోచ్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో వాళ్ల ఏడుపులు, బాధ చూడలేకపోతున్నా. అయితే ఆటలో ఇవన్నీ సహజం. సూర్యుడు ఈరోజు అస్తమించినా, రేపు ఉదయిస్తాడు. విజయం వచ్చినా, ఓటమి ఎదురైనా ఓ క్రీడాకారుడు ఎప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచించాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios