ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా క్రికెటర్లు, ఆ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. నాలుగో టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో దొరికిన సమయాన్ని కిడ్స్ జోన్‌లో ఎంజాయ్ చేస్తూ గడిపేశారు కొందరు భారత క్రికెటర్లు.

భారత విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌తో పాటు టీ20 జట్టులో చోటు దక్కించుకున్న శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్ కలిసి చిన్నపిల్లల్లా మారిపోయి అల్లరి చేస్తున్న వీడియోను ‘గబ్బర్’ దావన్ పోస్టు చేశాడు... 

 

‘ఎంత పెద్దవాళ్లం అయినా బాల్యం పోకూడదు. జీవితంలో పని చేయడం చాలా అవసరం, కానీ అప్పుడప్పుడు ఇలాంటి మస్తీ చేయడం చాలా అవసరం. కుల్దీప్ యాదవ్ తన ఫస్ట్ రైడ్ నేర్చుకుంటున్నాడు’ అంటూ కామెంట్ పెట్టాడు శిఖర్ ధావన్. దీనికి యజ్వేంద్ర చాహాల్... ‘నా రూమ్‌ నుంచి ఇదంతా చూస్తున్నాం... పిల్లల మస్తీ...’ అంటూ కామెంట్ చేశాడు.