Asianet News TeluguAsianet News Telugu

వెండితెరపై హిట్‌మ్యాన్ ఎంట్రీ..? కీలక అప్డేట్ ఇచ్చిన రోహిత్ శర్మ

Mega Blockbuster: టీమిండియా సారథి రోహిత్ శర్మ త్వరలోనే  వెండితెరపై మెరవనున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. తాజాగా అందుకు సంబంధించి అతడు కీలక  అప్టేడ్ ఇచ్చాడు. 

Rohit Sharma All set to Make his Acting Debut, shares Interesting Picture in Instagram
Author
First Published Sep 1, 2022, 8:54 PM IST

భారత జట్టు సారథి రోహిత్ శర్మ  వెండితెరపై కనిపించేందుకు రంగం సిద్ధమైంది.  35 ఏండ్ల రోహిత్.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓ చిత్రంలో కనిపించనున్నాడు.  ఈ మేరకు  రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా  ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. తన లుక్ కు పూర్తి భిన్నంగా కనిపిస్తూ.. రోహిత్ ఇన్‌స్టాలో  ఓ ఫోటోను షేర్ చేశాడు.  బాలీవుడ్ (?) లో తెరకెక్కుతున్న మెగా బ్లాక్ బస్టర్ సినిమాలో రోహిత్  కీలక పాత్ర పోషించనున్నాడని తెలుస్తున్నది. 

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రోహిత్ శర్మ తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తూ.. ‘నా కడుపులో సీతాకోకచిలుకలు ఇది ఒకరకమైన అరంగేట్రం..’ అని రాసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.  

ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మిగిలిన ఏ విషయాన్ని  రోహిత్ ఈ పోస్టులో పంచుకోలేదు. దీంతో ఇది ఏ భాషలో తెరకెక్కుతుంది..? నటీనటులు ఎవరు.?? కథ ఏంటి..? సాంకేతిక నిపుణులు ఎవరు..? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.  ఓసీమ్  నిర్మాణంలో తెరకెక్కుతున్న మెగా బ్లాక్ బస్టర్ సినిమాకు సంబంధించి ఈ నెల నాలుగో తేదీన ట్రైలర్ రిలీజ్ కానుున్నది.  ఈ విషయాన్ని కూడా రోహిత్ తన పోస్టులో తెలిపాడు.  

 

రోహిత్ తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, తమిళ నటుడు కార్తీ, ప్రముఖ కామెడీ షో  నిర్వాహకుడు కపిల్ శర్మ, అందాల నటీమణులు రష్మిక మందన, త్రిషా కృష్ణన్ లు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈనెల 4 తారీఖున ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. అప్పటిదాకా ఈ సస్పెన్స్ కొనసాగనుంది. 

 

ఇదిలాఉండగా రోహిత్ ఎంట్రీ పై టీమిండియా ఫ్యాన్స్  హర్షం  వ్యక్తం చేస్తున్నారు. నిత్యం క్రికెట్ తో బిజీగా ఉండే హిట్ మ్యాన్ సినిమా ఎప్పుడు చేశాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు మాత్రం రోహిత్ ను వెండితెర మీద చూసేందుకు  వేయికండ్లతో ఎదురుచూస్తున్నట్టు చెబుతున్నారు. మరి ఈసినిమాలో రోహిత్ నటిస్తున్నాడా..? నటిస్తే ఏ పాత్ర..? అనేది 4న వెల్లడికానున్నది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios