ఐపీఎల్-2019లో రాజస్థాన్ యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అతి పిన్న వయసులో అర్ధశతకం నమోదు చేసి అంతకు ముందున్న రికార్డును బద్ధలు కొట్టాడు

ఐపీఎల్-2019లో రాజస్థాన్ యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అతి పిన్న వయసులో అర్ధశతకం నమోదు చేసి అంతకు ముందున్న రికార్డును బద్ధలు కొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన పరాగ్.. అర్థసెంచరీ నమోదు చేశాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ క్రమంలో ఈ ఘటన సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 17 సంవత్సరాల 175 రోజుల్లోనే అర్ధసెంచరీ సాధించిన పరాగ్.. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన సంజూ శాంసన్ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు.

రాజస్థాన్ తరపున మొత్తం 7 మ్యాచ్‌లాడిన పరాగ్ 32 సగటుతో 160 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో రాయల్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.