న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంటికి వెళ్తున్న సమయంలో రిషబ్ పంత్ కారుకి ప్రమాదం... తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్...
భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. శ్రీలంకతో సిరీస్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కారులో న్యూఢిల్లీలోని రూకీ ఏరియాకి బయలుదేరాడు.
వేగంగా దూసుకువెళ్తున్న కారు, రోడ్డు డివైడర్‌ని ఢీ కొట్టింది. ఉదయం 5 గంటల 15 నిమిషాలకు రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనట్టు సమాచారం. ఈ సమయంలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారులో నుంచి భారీ ఎత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. అయితే సరైన సమయానికి కారులో నుంచి రిషబ్ పంత్ బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది...
అయితే ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకు, వెన్నెముకకి, కాళ్లకు గాయాలయ్యాయి. రిషబ్ పంత్‌ని గుర్తించిన అటుగా వెళ్తున్న ప్రయాణీకులు, ఢిల్లీ సమీపంలో ఉన్న సాక్ష్యం ఆసుపత్రిలో జాయిన్ చేశారు. తాత్కాలిక చికిత్స తర్వాత అతన్ని డెహ్రాడూన్‌ని తరలించారు. ప్రస్తుతం రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది..
జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి గురించి అప్‌డేట్ ఇచ్చాడు. రిషబ్ పంత్ ప్రాణాలకేమీ ప్రమాదం లేదని, అతను త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశాడు వీవీఎస్ లక్ష్మణ్..
