Asianet News TeluguAsianet News Telugu

స్పోర్ట్స్ కార్లంటే విపరీతమైన మోజు... డ్రైవర్‌ని కూడా పెట్టుకోవడానికి ఇష్టపడని రిషబ్ పంత్...

నాలుగు ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన రిషబ్ పంత్... డ్రైవర్‌ని కూడా పెట్టుకోకుండా స్వయంగా డ్రైవింగ్‌ చేసుకుంటూ ఇంటికి బయలుదేరిన సమయంలో ప్రమాదం...

Rishabh Pant loves sports Cars, No Driver with him during Car accident near delhi
Author
First Published Dec 30, 2022, 11:29 AM IST

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే స్టార్ క్రికెటర్‌గా ఎదుగుతూ టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో ఉన్న రిషబ్ పంత్, కారు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడడంతో క్రికెట్ ప్రపంచం షాక్‌కి గురైంది. పంత్ త్వరగా కోలుకుని, క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు...

రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్‌ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు పూర్తిగా దగ్ధమైంది. వేగంగా దూసుకెళ్తున్న కారు, రోడ్డు డివైడర్‌ని ఢీకొట్టడంతోనే మంటలు వ్యాపించినట్టు ప్రత్యేక్ష సాక్ష్యుల కథనంలో తెలిసింది... క్రిస్‌మస్ రోజున ముగిసిన రెండో టెస్టుతో బంగ్లాదేశ్ టూర్ ముగించుకున్న టీమిండియా, డిసెంబర్ 26న ముంబై చేరుకుంది...

ముంబై చేరుకున్న తర్వాత నేరుగా జార్ఖండ్ వెళ్లిన రిషబ్ పంత్, భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంటికి వెళ్లాడు. అక్కడ మాహీ భాయ్‌తో కలిసి ఓ పార్టీలో పాల్గొన్న రిషబ్ పంత్ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు... జార్ఖండ్ నుంచి న్యూఢిల్లీలోకి తన ఇంటికి వెళ్లేందుకు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరాడు రిషబ్ పంత్...

ఢిల్లీ సమీపంలో రూకీ ఏరియాలో రిషబ్ పంత్ కారు, డివైడర్‌ని ఢీకొట్టింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రాత్రంతా నిద్రలేకుండా కారు నడుపుతుండడంతో రిషబ్ పంత్ కునుకు తీయడంతో కారు అదుపు తప్పి డివైడర్‌ని ఢీ కొట్టింది...

ఈ సమయంలో రిషబ్ పంత్‌ ఒక్కడే కారులో ఉండడంతో అటుగా వెళ్తున్న ప్రయాణీకులు, స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి... భారత క్రికెటర్‌ని ఆసుపత్రికి తరలించారు. రిషబ్ పంత్‌కి స్పోర్ట్స్ కార్లు, లగ్జరీ కార్లంటే అమితమైన ఇష్టం. భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో 2017లోనే ఆడీ A8 కారుని కొనుగోలు చేసిన రిషబ్ పంత్, మెర్సిండేజ్ బెంజ్ సీ క్లాస్, ఫోర్డ్ ముస్తంగ్, మెర్సిండేజ్ జీఎల్‌ఈ వంటి ఖరీదైన కార్లను సొంతం చేసుకున్నాడు. 

రిషబ్ పంత్‌కి కార్లంటే ఎంత ఇష్టమంటే ఎన్ని కార్లు కొనుక్కున్నా డ్రైవర్‌ని మాత్రం పెట్టుకోలేదు. తానే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఇదే ఇప్పుడు ప్రమాదానికి కారణమైంది. కనీసం రాత్రంతా పడుకుని, తెల్లారిన తర్వాత బయలుదేరినా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పోస్టులు చేస్తున్నారు రిషబ్ పంత్ అభిమానులు...

రిషబ్ పంత్ త్వరగా కోలుకుని, క్రికెట్ ఫీల్డ్‌లో అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు పోస్టులు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios