టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ సెటైర్లు వేశాడు. బుమ్రా... ఓ బేబీ బౌలర్ అంటూ కౌంటర్లు వేశాడు.  తాను ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో చురుగ్గా ఉండి ఉంటే జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడంలో ఎలాంటి సమస్యలు ఉండేవికావని అభిప్రాయపడ్డారు.

బుమ్రా యార్కర్లు వేయడంలో దిట్ట. ఇప్పటికే బుమ్రా యార్కర్లపై చాలా మంది క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే, వసిమ్ అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్, షోయబ్ అక్తర్ వంటి మాజీ బౌలర్లతో పోల్చితే బుమ్రా ఒక 'బేబీ బౌలర్' అని అబ్దుల్ రజాక్ అభిప్రాయపడ్డారు.

తాజాగా క్రికెట్ పాకిస్థాన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ "గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్ లాంటి దిగ్గజ బౌలర్లతో కలిసి ఆడాను. నా ముందు బుమ్రా బేబి బౌలర్ లాంటి వాడు. నేను అతడిపై సులభంగా ఆధిపత్యం చెలాయించి పరుగుల వరద పారించేవాడిని" అని చెప్పుకొచ్చాడు.

కాగా.. రజాక్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వినపడుతున్నాయి. బ్రుమా పై విమర్శలు చేసినందుకు ఇండియన్ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రజాక్ ని టార్గెట్ చేస్తూ సెటైర్లు వినపడుతున్నాయి. 

ప్రపంచ గొప్ప బౌలర్ రజాక్ అంటూ కొందరు సెటైర్లు వేస్తుంటే... ఇది ప్రపంచంలోకెళ్లా గొప్ప జోక్ అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.