భారతీయులకు ఆగ్రహం వచ్చినా, ఆనందం వచ్చినా ఓ పట్టాన ఆపలేం. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి ఇక్కడ బీభత్సమైన ఫాలోయింగ్, క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మరో ఆస్ట్రేలియా జర్నలిస్టు చేరింది.

ఆస్ట్రేలియా, ఇండియా సిరీస్ సమయంలో బ్రహ్మానందం ఫోటోలను పోస్టు చేసి, ఫన్నీ మీమీలు క్రియేట్ చేసిన ఆస్ట్రేలియా మహిళా జర్నలిస్టు చోలే అమండా బెయిలీ, ఇప్పుడు భారతీయుల ప్రేమలో తడిసి ముద్దవుతోంది.

చోలీ అమండాను ప్రస్తుతం అందరూ ‘బాబీ’ అని పిలుస్తూ ఆటపట్టిస్తున్నారు. దీనికి కారణం ఆమె కవర్ ఫోటోపై రిషబ్ పంత్ ప్రత్యక్షం కావడమే. ఐపీఎల్ సమయంలో రికీ పాంటింగ్ మాట్లాడుతుండగా వెనక నుంచి రిషబ్ పంత్ తొంగి చూస్తూ అల్లరి చేష్టలు చేసిన సంగతి తెలిసిందే.

దీన్ని ఎడిట్ చేసి, అమండా మాట్లాడుతుండగా రిషబ్ పంత్ తొంగి చూస్తున్నట్టు, వీళ్ల చేష్టలను రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ కోపంగా చూస్తున్నట్టు ఫన్నీగా ఉందీ కవర్ పిక్. దీంతో చోలే అమండా ఒక్కసారిగా భారత అభిమానులకు ‘బాబీ’ అయిపోయింది. ‘అందరూ నన్ను ఎందుకు బాబీ అంటున్నారు’ అంటూ ఆమె పెట్టిన పోస్టుకి వేలల్లో లైకులు వచ్చాయి.