టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో యువ క్రికెటర్ రిషబ్ పంత్  సమయం గడుపుతున్నాడు. రాంచీలోని ధోని నివాసంలో పంత్ సరదాగా గడిపాడు. ఇద్దరూ కలిసి గార్డెన్ లో కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ధోనీ  శునకంతో పంత్ కాసేపు ఆడుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను పంత్ తన  ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోకి గుడ్ వైబ్స్ ఓన్లీ అని ఓ క్యాప్షన్ ఇచ్చాడు.

కాగా.. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫోటోపై నెటిజన్లు కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. కొందరు పంత్ కి కొన్ని సూచనలు ఇస్తుండగా.. మరికొందరు మాత్రం ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

AlsoRead బుమ్రా, స్మృతి మంధానాలకు అరుదైన గౌరవం... విజ్డెన్ పురస్కారాలు...

కీపింగ్ లో ధోనీ వద్ద సూచనలు, సలహాలు తీసుకుంటున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.... కుక్కతో ఏం చేస్తున్నావు పంత్ అంటూ కొందరు చమత్కరిస్తున్నారు. మరికొందరు మాత్రం సీనియర్ కదా... మంచి సూచనలు తీసుకో అంటూ సూచిస్తున్నారు.

గురువారం ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమీటి బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రిషభ్‌ పంత్‌ను కూడా జట్టులో ఉన్నా శాంసన్‌ను రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌-వికెట్‌ కీపర్‌గా తీసుకున్నారు. ఇక ప్రపంచకప్ అనంతరం ధోని క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందిచాలనే ఉద్దేశంతో వెస్టిండీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీస్‌లకు కూడా అందుబాటులో లేడు. ప్రస్తుతం ధోని కుటుంబంతో గడుపుతూ వ్యక్తిగత పనులతో బిజీగా ఉన్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Good Vibes Only 😎🤘🏻 🐕 @mahi7781

A post shared by Rishabh Pant (@rishabpant) on Oct 24, 2019 at 10:51pm PDT