టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధానలకు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ లో నోబెల్ ఫ్రైజ్ గా భావించే విజ్డెన్ పురస్కారాలకు భారత్ నుంచి బుమ్రా, స్మృతి మంధానలు ఎంపికయ్యారు. బుమ్రా, స్మృతి మంధానలు ‘విజ్డెన్‌ ఇండియా అల్మానక్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాలకు ఎంపికైనట్టు విజ్డెన్ ఇండియా ప్రకటించింది. 

పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్, శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే, ఆప్ఘాన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్‌లు కూడా ఈ ఏడాది విజ్టెన్ పురస్కారం అందుకోనున్నారు. మొత్తం ఐదుగురికి ఈ పురస్కారాలు లభించగా, వారిలో ఇద్దరు భారతీయులు ఉండడం గమనార్హం. 

ఇక, దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ బాదిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ గురించి విజ్డెన్ ఇండియా మ్యాగజైన్ తాజా ఎడిషన్‌లో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. కాగా, విజ్డెన్ పురస్కారానికి ఎంపికైన మూడో భారత మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డులెక్కింది. ఆమె కంటే ముందు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, దీప్తిశర్మ ఈ ఈ పురస్కారాలు అందుకున్నారు.

మొత్తం ఐదుగురికి పురస్కారాలు ప్రకటించగా అందులో ఇద్దరు భారతీయులే ఉన్నారు.  ఆసియా నుంచి ఫకర్‌ జమాన్‌ (పాక్‌), దిముతు కరుణరత్నె (శ్రీలంక), రషీద్‌ ఖాన్‌ (అఫ్గాన్‌)ను ఈ పురస్కారాలు వరించాయి.  

భారత్‌ నుంచి విజ్డెన్‌ పురస్కారానికి ఎంపికైన భారత మూడో మహిళా క్రికెటర్‌ స్మృతి. అంతకన్నా ముందు మిథాలీ రాజ్‌, దీప్తి శర్మ ఈ ఘనత సాధించారు. టీమిండియా యువ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సైతం అరుదైన ఘనత పొందాడు. 2019, 2020కి గాను ఏడో ఎడిషన్‌ వార్షిక సంచికల్లో అతడి గురించి ప్రత్యేక కథనాలు ముద్రించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అతడు డ్యుయల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.  అలాగే దిగ్గజ ఆటగాళ్లైన గుండప్ప విశ్వనాథ్‌, లాలా అమర్‌నాథ్‌లు విజ్డెన్‌ ఇండియా హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించారు.