Asianet News TeluguAsianet News Telugu

RCBvsSRH: మెరిసిన సన్‌రైజర్స్ బౌలింగ్... హైదరాబాద్ ముందు ఊరించే టార్గెట్...

రెండు వికెట్లు తీసిన సందీప్ శర్మ... జాసన్ హోల్డర్‌కి రెండు వికెట్లు...

32 పరుగులు చేసిన జోష్ ఫిలిప్... 24 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్...

వరుస విరామాల్లో వికెట్లు తీసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు...

 

RCB vs SRH: Sunrisers Hyderabad excellent bowling controlling rcb for low score CRA
Author
India, First Published Oct 31, 2020, 9:06 PM IST

IPL 2020 ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ 5 పరుగులకి అవుట్ కాగా... కెప్టెన్ విరాట్ కోహ్లీ 7 పరుగులకి పెవిలియన్ చేరాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో రికార్డు స్థాయిలో ఏడోసారి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ.

ఏబీ డివిల్లియర్స్ 24 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ కాగా జోష్ ఫిలిప్ 31 బంతుల్లో 4 ఫోర్లతో 32 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ 18 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేయగా... గురుకీరత్ 24 బంతుల్లో 15, సిరాజ్ ఒక్క పరుగు చేశాడు. ఉదన డకౌట్ అయ్యాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీయగా నటరాజన్, రషీద్ ఖాన్, నదీమ్ తలా ఓ వికెట్ తీశారు. స్వల్ప లక్ష్యమే అయినా రెండు మ్యాచుల ముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 127 పరుగుల ఈజీ లక్ష్యాన్ని చేధించలేకపోయింది సన్‌రైజర్స్. మరి నేటి మ్యాచ్‌లో అయినా రైజ్ అవ్వగలదా లేదో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios