Asianet News TeluguAsianet News Telugu

RCBvsSRH: కీలక మ్యాచ్‌లో గెలిచి, నిలిచిన సన్‌రైజర్స్... మరింత ఆసక్తికరంగా ప్లేఆఫ్స్...

39 పరుగులు చేసిన వృద్దిమాన్ సాహా...

26 పరుగులు చేసిన మనీశ్ పాండే...

రెండు వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్...

RCB vs SRH: Sunrisers Hyderabad crucial win against Royal Challengers CRA
Author
India, First Published Oct 31, 2020, 10:48 PM IST

IPL 2020 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టే ఆటతీరుతో అద్భుత విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. 121 పరుగుల లో-టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్...  14.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 8 పరుగులకే అవుట్ కావడంతో 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్. 

ఆ తర్వాత మనీశ్ పాండేతో కలిసి రెండో వికెట్‌కి 50 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు వృద్ధిమాన్ సాహా. 19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన మనీశ్ పాండే, 32 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, 8 పరుగులు చేసిన కేన్ విలియంసన్ వెంటవెంటనే అవుట్ కావడంతో ఉత్కంఠ రేగింది.

మరోసారి వరుస వికెట్లు కోల్పోయి, మ్యాచ్‌ను పోగొట్టుకుంటారేమోనని అనిపించింది. అయితే జాసన్ హోల్డర్ వరుస బౌండరీలు బాది మ్యాచ్‌ను ఈజీ చేసి పడేశాడు. 10 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేసిన జాసన్ హోల్డర్, సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 35 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. 

Follow Us:
Download App:
  • android
  • ios