RCB vs SRH Highlights : మాములుగా కొట్ట‌లేదు భ‌య్యా.. హైద‌రాబాద్ మాస్ హిట్టింగ్.. పోరాడి ఓడిన బెంగ‌ళూరు

IPL 2024 RCB vs SRH Highlights : బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియం బౌండ‌రీల వ‌ర్షంతో త‌డిసిపోయింది. సిక్స‌ర్ల మోత‌తో అదిరిపోయింది. హైద‌రాబాద్-బెంగ‌ళూరు ఆట‌గాళ్లు ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో ఇరు జ‌ట్లు ఒక్కోటి 250+ స్కోర్ల‌ను సాధించాయి. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన హైద‌రాబాద్ గెలుపు అందుకుంది. 
 

RCB vs SRH Highlights : Hyderabad Mass Hitting.. Bangalore, who fought and lost, Tata IPL 2024  RMA

RCB vs SRH Highlights : బెంగ‌ళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప‌రుగుల వ‌ర‌ద పారింది. హైద‌రాబాద్ బ్యాట‌ర్లు మాములుగా కొట్ట‌లేదు భ‌య్యా.. మాస్ హిట్టింగ్ తో అద‌ర‌గొట్టారు. ఆ త‌ర్వాత బ్యాటింగ్ కు దిగిన బెంగ‌ళూరు సైతం ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపింది. దీంతో బెంగ‌ళూరు స్టేడియంలో ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిసింది. అయితే, బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌రో విజ‌యాన్ని అందుకుంది. ఐపీఎల్ 2024 30వ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు-స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగ‌ళూరు టీమ్ బౌలింగ్ ఎంచుకుంది.

బ్యాటింగ్ కు దిగిన ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి వికెట్ కు 108 పరుగులు జోడించారు. హెడ్ 41 బంతుల్లో 102 పరుగులతో ఈ సీజ‌న్ లో తొలి సెంచ‌రీ కొట్టాడు. అభిషేక్ 22 బంతుల్లో 34 పరుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన హెన్రిచ్ క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్ తో 31 బంతుల్లో 67 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో ఆడమ్ మార్క్రమ్ 17 బంతుల్లో 32 పరుగులు చేయగా, అబ్దుల్ సమద్ 10 బంతుల్లో అజేయంగా 37 పరుగులు చేశాడు దీంతో మూడు వికెట్లు కోల్పోయి హైదరాబాద్ టీమ్ 287 పరుగులతో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక జ‌ట్టు స్కోర్ ను న‌మోదుచేసింది.

అప్పుడు క్రిస్ గేల్.. ఇప్పుడు ట్రావిస్ హెడ్ సూప‌ర్ సెంచ‌రీతో బ‌ద్ద‌లైన రికార్డులు ఇవే

 

 

288 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు మంచి శుభారంభం ల‌భించింది. ఓపెన‌ర్లు విరాట్ కోహ్లీ-ఫాఫ్ డుప్లెసిస్ లు తొలి వికెట్ కు 80 ప‌రుగులు జోడించాడు. దుకుడుగా ఆడుతున్న విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 42 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు. విరాట్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన విల్ జాక్స్, రజత్ పటిదార్, సౌరవ్ చౌహాన్ లు సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యారు. మరో ఎండ్ లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ కొట్టి స్పీడ్ పెంచిన క్రమంలో ఔట్ అయ్యాడు. 62 పరుగుల తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.

 ఆర్సీబీ గెలుపునకు కావాల్సిన రన్ రేటు పెరుగుతున్న క్రమంలో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ సూపర్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. బ్యాట్ తో అదరగొడుతూ ఈ సీజన్ లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ కొట్టాడు.  35 బంతుల్లో 237 స్ట్రైక్ రేటుతో 83 పరుగులు కొట్టాడు. తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. లామ్రోర్ 19, అనుజ్ రావత్ 25 పరుగుల ఇన్నింగ్ ఆడిన విజయం సాధంచలేకపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ పై హైదరాబాద్ టీమ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 

RCB vs SRH : త‌న రికార్డును తానే బ్రేక్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

 

 

కిర్రాక్ బ్యాటింగ్.. సిక్స‌ర్లే సిక్స‌ర్లు.. 39 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ రికార్డు సెంచ‌రీ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios