RCB vs KKR Gambhir, Kohli : బెంగళూరు-కోల్ కతా మ్యాచ్ అంటే మొదటగా గుర్తుకు వచ్చే పేర్లు విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్. ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు గతంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తీవ్ర వాగ్వాదంతో ఘర్షణ పడ్డారు.
RCB vs KKR Gambhir, Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 204) లో భాగంగా జరిగిన 10 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ టీమ్ బెంగళూరుపై శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా టీమ్ బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 83 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 183 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా టీమ్ కు సునీల్ నరైన్, ఫలిప్ సాల్ట్ లు శుభారంభం అందించారు. సునీల్ నరైన్ 47 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 50 పరుగులతో రాణించడంతో ఆర్సీబీపై కేకేఆర్ విజయం సాధించింది.
అయితే, మాములుగానే కేకేఆర్-బెంగళూరు మ్యాచ్ లో మాములగా క్రేజ్ ఉండదు. ఈ మ్యాచ్ లో మొదటగా గుర్తుకు వచ్చే పేర్లు విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్. ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు గతంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తీవ్ర వాగ్వాదంతో ఘర్షణ పడ్డారు. అప్పటి నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు మారాయి. అయితే, ఐపీఎల్ 2024లో కేకేఆర్-ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ సందర్బంగా ఆసక్తికరమైన.. దాదాపు ఏవరూ ఊహించని విధంగా ఒక ఘటన జరిగింది. చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ లు కలుసుకున్నారు. ఒకరినొకరు పలకరించుకోవడం.. హగ్ చేసుకోవడం కనిపించింది.
RCB VS KKR HIGHLIGHTS : పూర్ బౌలింగ్.. విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ వృధా.. ఆర్సీబీకి కేకేఆర్ షాక్
సంబంధిత దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు రెండో సంతానం, మగబిడ్డకు స్వాగతం పలికారు. తమ బిడ్డకు అకాయ్ అని పేరు పెట్టినట్టు కూడా ప్రకటించారు. దాదాపు రెండో నెలల తార్వాత విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున గ్రౌండ్ లోకి దిగాడు. గౌతమ్ గంభీర్ తమ రెండో సంతానం పొందిన విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపానట్టుగా సంబంధిత దృశ్యాలు చూస్తే తెలుస్తోంది.ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు మంచి వాతావరణంలో కలిసి కనిపించడంతో క్రికెట్ లవర్స్, మాజీ క్రికెట్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇద్దరు ప్లేయర్లు హగ్ చేసుకోవడం, కరచాలనం చేసుకోవడం.. మాట్లాడుకోవడం కనిపించింది.
RCB vs KKR : టార్గెట్ చేశాడు.. దుమ్మురేపాడు.. కేకేఆర్ పై విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్
