RCB vs KKR IPL 2024 : ఐపీఎల్ 2024 10వ మ్యాచ్ లో బెంగ‌ళూరు-కోల్ క‌తా మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. అయితే, వ‌రుస‌గా బెంగ‌ళూరుకు హోం గ్రౌండ్ లో షాకిస్తూనే ఉంది కేకేఆర్.  

RCB vs KKR - Virat Kohli : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 204) లో భాగంగా జ‌రిగిన 10 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ టీమ్ బెంగ‌ళూరుకు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ షాకిచ్చింది. వ‌రుస‌గా హోం గ్రౌండ్ లో బెంగ‌ళూరును ఓడిస్తూ రికార్డు విజ‌యాన్ని అందుకుంది కేకేఆర్. వ‌రుస‌గా ఆరు సార్లు ఆర్సీబీని వారి హోం గ్రౌండ్ లో కేకేఆర్ ఓడించింది. టాటా ఐపీఎల్ 2024లో హోం టీమ్ ఓడిపోవ‌డం ఇదే మొద‌టిసారి.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ క‌తా టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీతో మంచి ఆరంభం లభించింది. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 83 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కామెరాన్ గ్రీన్ 33, గ్లెన్ మ్యాక్స్ వెల్ 28 పరుగులు చేశారు.యంగ్ ప్లేయర్ రజత్ పటిదారు (3 పరుగులు), వికెట్ కీపర్ అనుజ్ రావత్ (2 పరుగులు) నిరాశపరిచారు. చివరల్లో దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించాడు. 8 బంతుల్లో 3 సిక్సర్లు బాది 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

Scroll to load tweet…

183 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా టీమ్ కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫలిప్ సాల్ట్ ధనాధన్ బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. సునీల్ నరైన్ 47 పరుగుల తన ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. సాల్ట్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ లు కోల్ కతాను విజయం వైపు నడిపించారు. వెంకటేష్ అయ్యర్ 30 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. శ్రేయాస్ అయ్యర్ 39 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సిక్సర్ తో కేకేఆర్ కు విజయాన్ని అందించాడు. 


Scroll to load tweet…

RCB VS KKR : టార్గెట్ చేశాడు.. దుమ్మురేపాడు.. కేకేఆర్ పై విరాట్ కోహ్లీ సూప‌ర్ ఇన్నింగ్స్