Asianet News TeluguAsianet News Telugu

RCBvsKKR: దంచికొట్టిన ఏబీడీ... రాయల్ ఛాలెంజర్స్ భారీ స్కోరు...

మంచి ఆరంభం ఇచ్చిన దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్...

ఏబీ డివిల్లియర్స్ మెరుపు హాఫ్ సెంచరీ... కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ...

 

RCB vs KKR: Royal challengers Bangalore scored big total against KKR CRA
Author
India, First Published Oct 12, 2020, 9:17 PM IST

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డివిల్లియర్స్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ 23 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేయగా... ఆరోన్ ఫించ్ 37 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఏబీ డివిల్లియర్స్ 73 పరుగులు చేయగా... విరాట్ కోహ్లీ 33 పరుగులు చేశాడు.  23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న ఏబీ డివిల్లియర్స్, 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు చేయగా... విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక్క బౌండరీ ఉండడం విశేషం. మూడో వికెట్‌కి ఈ ఇద్దరూ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, ఆండ్రూ రస్సెల్ చెరో వికెట్ తీశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios