Asianet News TeluguAsianet News Telugu

దంచికొట్టిన డివిలియర్స్.. కేకేఆర్ బౌలర్స్ పై ట్రోల్స్

ఇక ఏబీ డివిలియర్స్ 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డివిలియర్స్ ఆటకు అభిమానులు ఫిదా అయిపోయారు. 

RCB vs KKR, IPL 2021: AB de Villiers Floors Twitter With Brutal Assault On Kolkata Knight Riders Bowlers
Author
Hyderabad, First Published Apr 19, 2021, 9:41 AM IST

ఐపీఎల్ 14వ సీజన్ లో ఆర్సీబీ వరస విజయాలతో దూసుకువెళుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లోనూ ఆర్సీబీ విజయం సాధించింది.  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిన్న  కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. 

 

విధ్వంసక ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్ వెల్ వీరవిహారం చేయడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. ఇక ఏబీ డివిలియర్స్ 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డివిలియర్స్ ఆటకు అభిమానులు ఫిదా అయిపోయారు. బ్యాట్ తో వీర బాదుడు బాది... జట్టుని విజయ తీరానికి చేర్చాడు. కాగా.. డివిలియర్స్ బ్యాటింగ్ చూసిన తర్వాత... కేకేఆర్ బౌలర్స్ ని నెటిజన్లు ట్రోల్ చేయడం గమనార్హం.

ఆర్సీబీ ప్రాబ్లంలో ఉందని తెలియగానే.. డివిలయర్స్ మే హూనా అంటూ అదరగొట్టాడని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓ వైపు డివిలియర్స్, మ్యాక్స్ వెల్ లపై ప్రశంసలు కురిపిస్తూనే.. మరోవైపు కేకేఆర్ ని ట్రోల్ చేయడం గమనార్హం. ఫీల్డింగ్ సరిగా చేయలేకపోయారని.. అందుకే ఆర్సీబీ భారీ స్కోర్ చేసిందని విమర్శించడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios