గుడ్ న్యూస్ చెప్పిన మ్యాక్స్‌వెల్ వైఫ్.. రెండు ఐపీఎల్ సీజన్ల మధ్య ఆ పని పూర్తి చేసిన ఆర్సీబీ బ్యాటర్

IPL 2023: ఐపీఎల్ లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న   ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్  తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. 

RCB Star Glenn Maxwell Wife vini Raman Shares  News Of Pregnancy on Social Media  MSV

బరిలోకి దిగితే ఎంత   గొప్ప బౌలర్‌ను అయినా జాలి, దయ, కరుణ లేకుండా వీరబాదుడు బాదే ఆర్సీబీ స్టార్ ఆల్ రౌండర్  గ్లెన్ మ్యాక్స్‌వెల్  రెండు ఐపీఎల్ సీజన్ల మధ్య   తన జీవితానికి సంబంధించిన రెండు కీలక పనులను పూర్తి చేశాడు. గతేడాది ఐపీఎల్ సీజన్ కు ముందు పెళ్లి చేసుకుని (మార్చి)  ఆర్సీబీ క్యాంప్ లో చేరిన  మ్యాక్సీ.. విని రామన్ దంపతులు ఇక్కడే రిసెప్షన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మ్యాక్సీ - రామన్ లు   ప్రమోట్ అయి పేరెంట్స్ కాబోతున్నారు. ఈ విషయాన్ని  స్వయంగా విని రామనే తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది. 

తాము త్వరలోనే   తల్లిదండ్రులం కాబోతున్నామని విని రామన్  తన ఇన్‌స్టా లో  ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘గ్లెన్, నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నాం.     2023 సెప్టెంబర్  లో మా రెయిన్ బో బేబీ   ఈ లోకంలోకి రాబోతుంది...

ఈ ప్రయాణం సులభతరమైనది కాదని మేం గుర్తించడం చాలా ముఖ్యం.  ఇటువంటి ఒకరోజు ఎప్పుడొస్తుందా..? అని ఎదురుచూడటం, సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులను చూడటం  ఎంత బాధాకరంగా ఉంటుందో నేను ఊహించగలను.  సంతానోత్పత్తి లేని,  పురిటిలోనే  బిడ్డలను కోల్పోయే   తల్లిదండ్రులకు మేం ప్రేమను పంచుతున్నాం..’అని ఆమె రాసుకొచ్చింది.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vini Maxwell (@vini.raman)

రెయిన్ బో బేబీ అంటే.. 

ఈ పోస్టులో  రామన్ ‘రెయిన్ బో బేబీ’ అని మెన్షన్ చేయడం అందరినీ ఆకర్షించింది.  రెయిన్ బో బేబీ అంటే అంతకుముందు  ఒక మహిళకు గర్భస్రావం   అయి ఉంటేనో లేక  ఏదైనా కారణం వల్ల   శిశువు తల్లి కడుపులోనే మరణిస్తే  వారి తర్వాత  పుట్టే బిడ్డను రెయిన్ బో బేబీ అని పిలుస్తారు.  అంటే దీని ప్రకారం  రామన్ ఇదివరకే  ప్రెగ్నెంట్ అయి ఉండి బహుశా ఏదైనా కారణాల వల్ల గర్భస్రావం అయి ఉంటుందనే తెలుస్తున్నది.   ఈ విషయాన్ని అటు రామన్ గానీ   మ్యాక్స్‌వెల్ గానీ  సోషల్ మీడియాలో పోస్టులు చేయలేదు. అదీగాక గతేడాది మ్యాక్సీ కూడా  కాలుకు గాయంతో  చాలా కాలం పాటు బెడ్ కే పరిమితమై సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు.  కాగా ఈ రెయిన్ బో బేబే అంటే ఏమిటన్న విషయాన్ని కూడా విని రామనే తన  పోస్టులో కామెంట్స్ చేయడం గమనార్హం.

34 ఏండ్ల మ్యాక్స్‌వెల్.. ఈ సీజన్ లో ఫుల్ జోష్ లో ఉన్నాడు.  ఆర్సీబీ తరఫున కేజీఎఫ్ (కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) లు ఆ జట్టు బ్యాటింగ్ కు ఏ రేంజ్ సపోర్ట్ ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఇప్పటివరకు  ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడిన మ్యాక్సీ..  186.44 స్ట్రైక్ రేట్ తో 330 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios