ఐపీఎల్-2019 సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌లోనే ఓడిపోవడంపై విచారం వ్యక్తం చేశాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ. మ్యాచ్ అనంతరం విరాట్ మాట్లాడుతూ.. చెత్త బ్యాటింగే తమ కొంప ముంచిందని అభిప్రాయపడ్డాడు.

గాలిలోని తేమను చూసి తొలుత 140-150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తామనుకున్నా.. కానీ అది కుదరలేదు. లీగ్‌ను చాలా చెత్తగా ఆరంభించాం. ఎలాగైనా మ్యాచ్‌లో గెలవాలని ప్రయత్నించామని, 18 ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లడం సంతృప్తినిచ్చిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

కనీసం 110 నుంచి 120 పరుగులు చేసినా పోరాడటానికి వీలుండేదని, అయితే చెన్నై తమ కన్నా అద్భుత ప్రదర్శన చేసిందని ప్రశంసించాడు. మరోవైపు రెండు బలమైన జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌‌లో మజా లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.