ఆరు వరుస ఓటముల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడంతో ఆ జట్టు కెప్టెన్ కోహ్లీ కాస్త ఊరట చెందాడు. ఈ సమయంలో తాను ఎదుర్కోన్న ఒత్తిడిని, విమర్శల గురించి మీడియాతో మాట్లాడాడు.

తన భార్య అనుష్క శర్మ ఈ సమయంలో మద్ధతుగా నిలిచిందని ఆమెపై ప్రశంసలు కురిపించాడు. తను నా బలమని.. ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడల్లా నన్ను ప్రొత్సహిస్తూ వస్తోందని... తను నా భార్యగా ఉన్నందుకు నేనెంతో అదృష్ణవంతుడినని కోహ్లీ పేర్కొన్నాడు.

ఇంతకు ముందు చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఆందోళనకు గురయ్యేవాడినని... అయితే పెళ్లయ్యాక, అనుష్క నా జీవితంలోకి వచ్చాకా తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని చెప్పాడు.

మ్యాచ్ దూరంగా ఉన్న సమయాన్ని ఆమెతోనే గడుపుతాను.. ప్రస్తుతం నాకున్న ఒత్తిడిని అధిగమించడానికి అనుష్కనే కారణం. ఆమెతో గడిపితే ఎలాంటి ఒత్తిడైనా దూరం అవుతోందన్నాడు.

ఒక బలమైన వ్యక్తి మనతో ఉంటే మనం కొండనైనా ఢీకొనగలమని....వరుసగా ఆరు ఓటముల తర్వాత ఎంతో ఒత్తిడితో ఉన్న నన్ను తన విలువైన మాటలతో ముందుకు నడిపిస్తోందని భార్యను ఆకాశానికెత్తేశాడు.