సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 2020కి సంబంధించి అన్ని జట్లు తీవ్రంగా సాధన చేస్తున్నాయి. తమ నెట్ ప్రాక్టీస్ వీడియోలను పలువురు ఆటగాళ్లు అభిమానులతో పంచుకుంటున్నారు.

అయితే కోహ్లీ మాత్రం తన బ్యాట్లను రిపేర్ చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తన బ్యాట్ హ్యాండిల్ బ్యాలెన్స్ కావడానికి కొద్దిగా కట్ చేశానని విరాట్ సమాధానమిచ్చాడు.

బ్యాట్ బ్యాలెన్స్ కోసం కొన్ని సెంటిమీటర్లైనా తనకు చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. తనకు బ్యాట్లంటే బాగా ఇష్టమని కోహ్లీ సోషల్  మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే కోహ్లీ బ్యాట్ రిపేరింగ్ నైపుణ్యం తనను విపరీతంగా ఆకట్టుకుందని ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్డిక్ పాండ్యా అన్నాడు.

తాను కూడా బ్యాట్‌లను రిపేర్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా కోహ్లీలా రిపేర్ చేస్తానని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ 2020 భాగంగా సెప్టెంబర్ 21వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది.