అద్భుతమైన డైరెక్ట్ హిట్‌తో కెఎల్ రాహుల్‌ను రనౌట్ చేసిన రవీంద్ర జడేజా...రవీంద్ర జడేజా పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌‌కి క్రిస్ గేల్ అవుట్... నాలుగు వికెట్లు తీసిన దీపక్ చాహార్...

టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ కింగ్స్, 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గత మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన దీపక్ చాహార్, కెరీర్ బెస్ట్ స్పెల్‌తో పంజాబ్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు.

మయాంక్ అగర్వాల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన దీపక్ చాహార్, సీఎస్‌కేకి తొలి బ్రేక్ అందించాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా వేసిన ఓ బుల్లెట్ త్రోకి కెఎల్ రాహుల్ రనౌట్ అయ్యాడు...

ఆ తర్వాత 10 పరుగులు చేసిన ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్‌ను కూడా కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు రవీంద్ర జడేజా. ఆ తర్వాత నికోలస్ పూరన్ డకౌట్ కాగా, దీపక్ హుడా 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Scroll to load tweet…

పంజాబ్ కోల్పోయిన 5 వికెట్లలో నాలుగు దీపక్ చాహార్ పడగొట్టగా, ఒకటి రనౌట్... 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు దీపక్ చాహార్.