కొన్నాళ్లుగా భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే, మొదటి టీ20 మ్యాచ్‌ను అద్భుత బ్యాటింగ్‌తో గెలిపించిన జడ్డూ, మూడో టెస్టు మ్యాచ్‌లో గాయపడ్డాడు.

జడేజా బొటినవేలికి సర్జరీ చేయడంతో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఆడలేకపోయాడు. ప్రస్తుతం రీఎంట్రీ కోసం శ్రమిస్తున్న రవీంద్ర జడేజా, 2025లో వరల్డ్ బెస్ట్ క్రికెటర్‌గా తానే ఉంటానంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉండే రాజస్థాన్ రాయల్స్, ‘2025లో వరల్డ్ బెస్ట్ క్రికెటర్‌గా ఎవరు ఉంటారు?’ అంటూ క్రికెట్ ఫ్యాన్స్‌ను ప్రశ్నించింది. దీనికి సమాధానం ఇచ్చిన రవీంద్ర జడేజా... ‘రవీంద్ర జడేజా’ అంటూ బలం చూపిస్తున్న చేతి ఎమోజీని పోస్టు చేశాడు.

దీంతో ఆర్‌ఆర్ అడ్మిన్ ‘మాకు సమాధానం దొరికేసింది...’ అంటూ కామెంట్ చేసేసింది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కి కూడా దూరమైన జడ్డూ, వన్డే సిరీస్‌లో లేదా నేరుగా ఐపీఎల్‌ 2021లో బరిలో దిగే అవకాశం ఉంది.