టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తన ఇన్ స్టాగ్రామ్ లో.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఫోటో షేర్ చేశాడు. కాగా.. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆఫ్ స్పిన్ బౌలర్ల యాక్షన్‌కు సంబంధించి ఉన్న ఈ కొల్లేజ్‌లో బాలీవుడ్ స్టార్ నటి కత్రినా కైఫ్ కూడా ఉండడం అశ్చర్యం కలిగిస్తోంది.

నిజానికి ఈ కొల్లేజ్‌ను ఓ అభిమాని క్రియేట్ చేశాడు. ఇందులో ఆఫ్ స్పిన్నర్లు అశ్విన్, రమేశ్ పొవార్, ఇంగ్లండ్ మాజీ బౌలర్ గ్రేమ్ స్వాన్ ఉన్నారు. అయితే, విచిత్రంగా వారితోపాటే బౌలింగ్ యాక్షన్‌ను తలపించేలా ఉన్న కత్రినా కైఫ్ డ్యాన్స్ క్లిప్‌ను కూడా జోడించాడు. అది అచ్చం బౌలింగ్ యాక్షన్‌ను తలపిస్తోంది. అశ్విన్ ఈ మీమ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేసి టీమిండియా మాజీ స్పిన్నర్ రమేశ్ పొవార్, ఇంగ్లండ్ మాజీ బౌలర్ గ్రేమ్ స్వాన్‌‌లను ట్యాగ్ చేశాడు. 

రెండు సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సారథ్యం వహించిన అశ్విన్ ఈసారి ఢిల్లీ కేపిటల్స్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్‌లో 139 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 26.43 సగటుతో 125 వికెట్లు పడగొట్టాడు. అజింక్య రహానే, అశ్విన్, మార్కస్ స్టోయిన్స్ వంటి వారితో పటిష్టంగా ఉన్న ఢిల్లీ కేపిటల్స్ ఈసారి ఐపీఎల్ టైటిల్‌పై కన్నేసింది. ఈ నెల 20న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఢిల్లీ తన తొలి మ్యాచ్ ఆడనుంది.