ఐపీఎల్ 2020 సీజన్‌ను పూర్తిచేసుకున్న ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్... ఇప్పుడు ఆసీస్ బీబీఎల్ 2020 లీగ్‌లో ఆడుతున్నాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో బాగానే రాణించిన రషీద్ ఖాన్, బిగ్‌బాష్ లీగ్‌లో తన ఫీల్డింగ్ విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

ఆడిలైడ్ స్టైకర్స్ తరుపున ఆడుతున్న రషీద్ ఖాన్... హోబార్డ్ హరీకేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.16వ ఓవర్‌లో ఇన్‌గ్రామ్ ఓ భారీ షాట్ ఆడాడు. బంతి దాదాపు సిక్సర్ వెళ్లిందని ఫిక్స్ అయిన ఇన్‌గ్రామ్‌కి షాక్ ఇచ్చాడు రషీద్ ఖాన్.

బౌండరీ లౌన్ దగ్గర పైకి ఎగురుతూ బంతిని ఒడిసి పట్టుకున్న రషీద్ ఖాన్... బౌండరీలోకి పడిపోకుండా కాసేపు బ్యాలెన్స్ చేశాడు. కాళ్లను పైకి లేపుతూ ఓ విధంగా డ్యాన్స్ చేశాడు. ఇక బౌండరీలోకి పడిపోవడం ఖాయం అనుకున్న టైమ్‌లో బంతిని పైకి విసిరి, మళ్లీ క్యాచ్ అందుకున్నాడు..