క్రికెట్‌లో రేర్ రికార్డు.. ప్రపంచంలో ఈ ముగ్గురు బౌలర్లకు మాత్రమే సాధ్యమైంది !
Rare record in cricket : క్రికెట్ ప్రపంచంలో అసాధ్యం అనుకున్నవి చాలా వరకు సుసాధ్యం అయ్యాయి. అలాంటి వాటిలో క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక ఓవర్‌లో 6 లీగల్ బంతులు వేస్తారు, అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో 5 బంతుల ఓవర్ వేసిన 3 బౌలర్లు ఉన్నారు.
Rare record in cricket : కాలం మారుతున్న కొద్ది ప్రపంచ క్రికెట్ లో అసాధ్యం అనుకున్న కొత్త రికార్డులు వచ్చి చేరుతూనే ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని రికార్డులు చాలా అరుదుగా ఉంటాయి. అంటే మీరు సులభంగా నమ్మలేరు కూడా. అలాంటివాటిలో ఒకటి ఒక ఓవర్ లో 5 బంతులు వేసిన బౌలింగ్ రికార్డులు. అదేలా అని మీకు అనిపించినా ఇది జరిగింది. క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక ఓవర్‌లో 6 లీగల్ బంతులు వేస్తారు. అంతకుమించి ఎక్కువ వేయడానికి, తక్కువ వేయడానికి కుదరదు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో 5 బంతుల ఓవర్ వేసి చాలా అరుదైన రికార్డును సాధించారు ముగ్గురు బౌలర్లు. ఈ రికార్డు దానికదే చాలా ప్రత్యేకమైనది. అంతర్జాతీయ క్రికెట్‌లో 5 బంతులు వేసిన ముగ్గురు బౌలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. లసిత్ మలింగ
శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ భారత్‌తో జరిగిన ఒక వన్డే మ్యాచ్‌లో 1 ఓవర్లో 6 బంతులు కాకుండా కేవలం 5 బంతులు వేశాడు. 2012లో భారత్‌తో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో వన్డే మ్యాచ్‌లో లసిత్ మలింగ ఈ ప్రత్యేక రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు.
2. నవీన్ ఉల్ హక్
ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్‌లో 1 ఓవర్‌లో 6 కాకుండా 5 బంతులు వేశాడు. నవీన్ ఉల్ హక్ వేసిన ఓవర్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్ పొరపాటు చేసి 1 బాల్ తక్కువగా లెక్కించడంతో ఇది జరిగింది.
3. ముస్తాఫిజుర్ రెహమాన్
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ 2021లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 1 ఓవర్‌లో 6 కాకుండా 5 బంతులు వేశాడు. వాస్తవానికి, ఆన్-ఫీల్డ్ అంపైర్ పొరపాటు కారణంగా ఈ పెద్ద తప్పు కనిపించింది. ముస్తాఫిజుర్ రెహమాన్ వేసిన ఓవర్‌లో బంగ్లాదేశ్‌లోని ఆన్-ఫీల్డ్ అంపైర్ ఘాజీ సోహైల్ 1 బంతిని తక్కువగా లెక్కించాడు.