ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ 2020 టైటిల్‌ గెలవడంపట్ల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వీరిలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటులు రణ్‌వీర్‌ సింగ్‌, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ముంబై గెలుపుపై సంతోషం వ్యక్తం చేశారు.

రోహిత్ సేన విజయం ఖాయమవగానే రణ్‌వీర్‌ సింగ్‌ ఆ జట్టు జెర్సీని ధరించి తన సినిమాలోని పాట పాడుతూ స్టెప్పులేశాడు. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

ఇక అమితాబ్‌, అభిషేక్‌ బచ్చన్‌, మిర్జాపుర్‌ నటుడు అలీ ఫజల్‌ కూడా ట్విటర్‌లో తన ఆనందాన్ని తెలియజేశారు. కాగా, దుబాయ్‌ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌లో ఢిల్లీ కాపిటల్స్‌పై ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా రెండో సంవత్సరం ఐపీఎల్‌ టైటిల్‌ని సాధించింది. 

తాజా మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీ జట్టు ట్రెంట్‌ బౌల్ట్‌ ధాటికి 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ( 65)తో జట్టును ఆదుకున్నాడు.

రిషబ్‌ పంత్‌ 56 పరుగులతో రాణించాడు. దాంతో ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్‌కు దిగిన ముంబై జట్టు ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ ( 20) ధాటిగా ఆడడంతో 3 ఓవర్లలో 33 పరుగులు చేసింది. మరోవైపు రోహిత్‌ ( 68 పరుగులు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌, ఇషాన్‌ కిషన్‌ (33 పరుగులు) మెరుపు బ్యాటింగ్‌తో ముంబై విజయతీరాలకు చేరింది. 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

CHAMPIONS!!!!! Make that 5 BABY !!!!! 💙💙💙💙💙 🏆🏆🏆🏆🏆 @mumbaiindians

A post shared by Ranveer Singh (@ranveersingh) on Nov 10, 2020 at 9:38am PST