WPL 2024: ఎల్లిస్ పెర్రీ అద్భుత బౌలింగ్.. ముంబైని చిత్తుచేసిన బెంగళూరు !
Mumbai vs Bangalore: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ రౌండ్‌లో చోటుదక్కించుకున్నాయి. మంగళవారం బెంగళూరు-ముంబై టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎల్లిస్ పెర్రీ అద్భుత బౌలింగ్ ఆరు వికెట్లు తీసుకోవడంతో ముంబై ఇండియన్స్ 113 పరుగులకే ఆలౌటైంది.
Mumbai Indians vs Royal Challengers Bangalore : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోంది. మొత్తం 5 జట్లు ఉండగా, ఒకదానితో ఒకటి 2 సార్లు ఆడాలి. లీగ్ రౌండ్ ముగిశాక టాప్ 3 జట్లు ప్లే ఆఫ్ రౌండ్‌లోకి ప్రవేశిస్తాయి. ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ రౌండ్‌లో చోటుదక్కించుకున్నాయి. మంగళవారం బెంగళూరు-ముంబై టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎల్లిస్ పెర్రీ అద్భుత బౌలింగ్ తో ముంబై ఇండియన్స్ 113 పరుగులకే ఆలౌటైంది.
బెంగళూరు కెప్టెన్ స్మృతి మందాన టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తదనుగుణంగా ముంబై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభం నుంచి బెంగళూరు జట్టు బౌలింగ్‌ను తట్టుకోలేక ముంబై జట్టు ఆటగాళ్లు వరుసగా వికెట్లు కోల్పోయి పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆ జట్టు 19 ఓవర్లు ముగిసేసరికి 113 పరుగులకు ఆలౌటైంది. ఎస్ సజన 30 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచారు. బెంగళూరు జట్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఎల్లిస్ పెర్రీ 6 వికెట్లు పడగొట్టారు.
స్టార్ ప్లేయర్లను వెనక్కినెట్టి ఐసీసీ అవార్డు అందుకున్న యశస్వి జైస్వాల్
114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు సునాయాసంగా విజయం సాధించింది. 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. బౌలింగ్ లో అదరగొట్టిన ఎల్లిస్ పెర్రీ బ్యాటింగ్ లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి బెంగళూరుకు విజయం సాధించి పెట్టింది. ఎల్లిస్ పెర్రీ 40* పరుగులు, రిచాఘోష్ 36* పరుగులతో అజేయంగా నిలిచారు. గెలుపుతో బెంగళూరు టీమ్ ప్లే ఆఫ్ రౌండ్ లో మూడో టీమ్ గా చోటు దక్కించుకుంది.
హార్దిక్ పాండ్యాకు అంత ఈజీ కాదు.. రోహిత్ కెప్టెన్సీ తొలగించడంపై ముంబై మాజీ కామెంట్స్ వైరల్ !