Asianet News TeluguAsianet News Telugu

Ramcharan: గల్లీ క్రికెట్ మీద మనసు పారేసుకున్న మెగా పవర్ స్టార్.. ఏకంగా ఓ జట్టునే కొనేశాడుగా.. 

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. సినీ ప్రపంచంలో వరుస విజయాలతో దూసుకెళ్తునే.. మరోవైపు వివిధ వ్యాపారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజగా క్రికెట్‏ లీగ్ లోకి అడుగుపెట్టారు. ఈ  క్రమంలో ఏకంగా ఓ క్రికెట్ టీమ్ ను కొనుగోలు చేశాడు. ఇంతకీ ఆ జట్టు ఏంటీ? ఆ లీగ్ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.

Ram Charan buys Hyderabad Team of Indian Street Premier League KRJ
Author
First Published Dec 24, 2023, 6:16 PM IST

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సినీ ప్రపంచంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆయన నయా బిజినెస్ లో అడుగుపెట్టారు. తాజాగా రామ్ చరణ్ క్రికెట్ పై మనస్సు పారేసుకున్నారు. గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడం భావించారు. ఇందుకోసం ఏకంగా ఓ క్రికెట్ టీమ్ ను కొనేశాడు. త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ జట్టును కొనుగోలు చేశారు.ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 

‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్‌ టీమ్‌కు యజమానిగా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిభ, సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం, గల్లీ క్రికెట్‌ సంస్కృతిని సెలబ్రేట్‌ చేసుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ఛార్మినార్ నేపథ్యంలో రూపొందించిన పోస్టర్ పై చరణ్ ఫోటోతో ఈ ప్రకటనను రిలీజ్ చేశారు. హైదరాబాద్ టీమ్ లో భాగం కావాలని భావించే ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోవాలంటూ రామ్ చరణ్ ఓ లింక్ ను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఈ అద్భుతమైన ఈ క్రికెట్ లీగ్ లో నాతో పాటు భాగస్వామ్యం అయ్యేందుకు ఇందులో చేరండి అంటూ పోస్ట్ చేశారు.  

ISPL ప్రారంభ ఎడిషన్ వచ్చే ఏడాది మార్చి 2 నుండి మార్చి 9 వరకు ముంబైలో జరుగనున్నది. ఇందులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ (జమ్మూ కాశ్మీర్) సహా ఆరు జట్టు పాల్గొనున్నాయి. ISPLతో అమితాబ్ బచ్చన్ , అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లకు కూడా జట్టు ఉన్నాయి. ముంబై జట్టుకు అమితాబ్‌ బచ్చన్‌, బెంగళూరు టీమ్‌కు హృతిక్‌ రోషన్‌, జమ్మూకశ్మీర్‌ టీమ్‌కు అక్షయ్‌ కుమార్‌ యజమానులుగా వ్యవహరిస్తున్నారు

ఈ సందర్బంగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ కోర్ కమిటీ మెంబర్ ఆశిష్ షెలార్ మాట్లాడుతూ.. "రామ్ చరణ్ ఐఎస్‌పిఎల్‌లోకి ప్రవేశించడం మా లీగ్‌లో కొత్త కోణాన్ని జోడిస్తుంది. క్రీడాలకు సినీ గ్లామర్ తోడైతే ఆ ప్రోత్సహం వేరేలా ఉంటుంది. క్రికెట్ పట్ల రామ్ చరణ్ కు  ఉన్న మక్కువ నిస్సందేహంగా వర్ధమాన క్రికెట్ ఆటగాళ్లకు గుర్తింపు కల్పించేందుకు, కొత్త టాలెంట్ ను వెలికి తీసేందుకు ఈ టోర్నీ ఉపయోగపడుతుందని తెలిపారు.రాబోయే రోజుల్లో ఈ సీజన్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. 

రామ్ చరణ్ రాబోయే ప్రాజెక్ట్‌లు

రామ్ చరణ్, సక్సెస్ పుల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్‌ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కైరా అద్వానీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్  IAS ఆఫీసర్‌గా నటించనున్నాడని సమాచారం. ఎస్ జె సూర్య, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ స్క్రిప్ట్ అందించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios