ఊరించి ఉసురుమ‌నిపించారు.. ఐపీఎల్ 2024 నుంచి ఆర్సీబీ ఔట్

RCB vs RR : ఐపీఎల్ 2024 ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. లీగ్ చివ‌రి ద‌శ‌లో వ‌రుస‌గా గెలుస్తూ ప్లేఆఫ్స్ లోకి వ‌చ్చిన ఆర్సీబీ ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ చేతిలో ఓడిపోయింది.
 

Rajasthan Royals beat Royal Challengers Bangalore in IPL 2024 eliminator match RMA

IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు-రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. అటుఇటు తిరిగిన మ్యాచ్ చివ‌ర‌కు రాజస్థాన్  చేతిలోకి వెళ్లింది. 4 వికెట్ల తేడాతో బెంగ‌ళూరుపై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది. దీంతో ఐపీఎల్ 2024 నుంచి ఆర్సీబీ ఔట్ కాగా, క్వాలిఫ‌య‌ర్ 2 లో హైద‌రాబాద్ లో రాజస్థాన్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ లో సంజూ శాంస‌న్ నాయ‌క‌త్వంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగ‌ళూరు ఇన్నింగ్స్ ను కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీలు ప్రారంభించారు.

అయితే, ఫాఫ్ డుప్లెసిస్ 17 పరుగుల వద్ద ఔట్ కావడంతో పవర్ ప్లే ఆర్సీబీకి షాక్ తగిలింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 33 పరుగులు  చేసి ఔట్ అయ్యాడు. ఇక్కడ నుంచి ఆర్సీబీ కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు. గ్రీన్ 27, పటిదార్ 34 పరుగులు చేశారు. గ్లెన్ మ్యాక్స్ వెల్ మరోసారి డకౌట్ అయ్యాడు. లామ్రోర్ 32, కార్తీక్ 11 పరుగులు చేశారు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో బెంగళూరు ప్లేయర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. అవేష్ ఖాన్ 3, అశ్విన్ 2 వికెట్లు తీసుకున్నారు. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. 

ఆరంభం అదిరింది.. మధ్యలో తడబడిన రాజస్థాన్.. 

173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన   రాజస్థాన్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్ లు మంచి ఆరంభం అందించారు. జైస్వాల్ 45 పరుగుల తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు బాదాడు. కాడ్మోర్ 20 పరుగులు చేశాడు. రియన్ పరాగ్ 36 పరుగులు చేసి ఔట్ అయిన తర్వాత ఒత్తిడిలోకి జారుకుంది రాజస్థాన్. ఇలాంటి సమయంలో హిట్మేయర్, రోవ్ మాన్ పావెల్ లు మంచి భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించారు. హిట్మేయర్ 26, పావెల్ 16 పరుగుల మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. 

 

 

ఐపీఎల్ హిస్ట‌రీలో ఒకేఒక్క‌డు కింగ్ కోహ్లీ స‌రికొత్త రికార్డు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios