Asianet News TeluguAsianet News Telugu

181 పరుగులకే టీమిండియా ఆలౌట్... ఇషాన్ కిషన్ తప్ప, అందరూ అట్టర్ ఫ్లాప్...

181 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా... ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ.. 

Rain Interrupts again, India vs West Indies 2nd Test, Sanju Samson, SuryaKumar Yadav CRA
Author
First Published Jul 29, 2023, 10:57 PM IST

వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు, రెండో వన్డేలో 181 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నా, 90/0 పరుగులతో శుభారంభం దక్కినా దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయిన టీమిండియా... 40.5 ఓవర్లలో చాపచుట్టేసింది..

ఇషాన్ కిషన్ 55, శుబ్‌మన్ గిల్ 34, సూర్యకుమార్ యాదవ్ 24, శార్దూల్ ఠాకూర్ 16, జడేజా 10 పరుగులు చేయడం మినహా మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు.  

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకి ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ కలిసి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 90 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత శుబ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది భారత జట్టు. 49 బంతుల్లో 5 ఫోర్లతో 34 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మోటీ బౌలింగ్‌లో అల్జెరీ జోసఫ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి వరుసగా ఎనిమిదో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు శుబ్‌మన్ గిల్.  గిల్ అవుటైన తర్వాతి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది టీమిండియా..

55 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో అతనజేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అక్షర్ పటేల్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో షై హోప్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో 7 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, జేడన్ సీల్స్ బౌలింగ్‌లో బ్రెండన్ కింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. 113 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా..

చాలా రోజుల తర్వాత తుది జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్, రాక రాక వచ్చిన అవకాశాన్ని పెద్దగా వాడుకోలేకపోయాడు. 19 బంతుల్లో 9 పరుగులు చేసిన సంజూ శాంసన్, కరియా బౌలింగ్‌లో బ్రెండన్ కింగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  సంజూ శాంసన్ అవుట్ కాగానే వర్షం కురవడంతో మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 24.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది భారత జట్టు.. 

కొద్దిసేపు విరామం తర్వాత ఆట మళ్లీ మొదలైంది. 21 బంతులు ఆడి 10 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి చ్చిన సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు..

90 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా, ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 22 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, అల్జెరీ జోషఫ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.. శార్దూల్ ఠాకూర్ అవుట్ అయ్యాక ఉమ్రాన్ మాలిక్ ఒక్క బంతి ఎదుర్కోగానే భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌కి మరోసారి అంతరాయం కలిగింది...

కొద్దిసేపటి తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది. ఉమ్రాన్ మాలిక్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో కార్టీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ముకేశ్ కుమార్ ఓ బౌండరీ, కుల్దీప్ యాదవ్ ఓ బౌండరీ బాదడంతో టీమిండియా స్కోరు 180+ మార్కు దాటగలిగింది. 6 పరుగులు చేసిన ముకేశ్ కుమార్‌ని మోటీ అవుట్ చేయడంతో 181 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్‌కి తెరపడింది.

Follow Us:
Download App:
  • android
  • ios