టీ20 వరల్డ్‌‌కప్ 2021 టోర్నీతో ముగియనున్న రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు... హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్, బౌలింగ్ కోచ్‌ పొజిషన్‌కి పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ పదవికి అజయ్ రత్రా దరఖాస్తు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైపోయింది. ఎన్‌సీఏ హెడ్ పదవికి రాజీనామా సమర్పించిన రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్‌కోచ్ పదవికి అధికారికంగా దరఖాస్తు సమర్పించాడు...

2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో టీమిండియా ఓటమి తర్వాత హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రవిశాస్త్రి, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాక్ చేతుల్లో భారత జట్టు ఓటమి తర్వాత ఆ పదవి నుంచి తప్పుకోబోతుండడం విశేషం.

ఇంతకుముందెన్నడూ లేని విధంగా రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో టెస్టుల్లో 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు, ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీపై పాక్‌పై ఉన్న అన్‌బీటెన్ రికార్డును కూడా కోల్పోవాల్సి వచ్చింది...

must READ: ఇండియా ఓడిందని మనవాళ్లే టపాసులు కాల్చారు, దీపావళి రోజు కాలిస్తే తప్పేంటి... సెహ్వాగ్ ట్వీట్...

బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పదవీకాలం కూడా ముగియనుంది. రాహుల్ ద్రావిడ్ సన్నిహితుడు, ఎన్‌సీఏ (జాతీయ క్రికెట్ అసోసియేషన్)లో బౌలింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన పరాస్ మాంబ్రే, బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు...

అలాగే ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా మళ్లీ బాధ్యతలు చేపట్టడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఫీల్డింగ్ కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అజయ్ రత్రా దరఖాస్తు సమర్పించాడు. హర్యానాకి చెందిన అజయ్ రత్రా, టీమిండియా తరుపున 6 టెస్టులు, 12 వన్డేలు ఆడాడు. ఇందులో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 115 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు. 

ఇవి కూడా చదవండి: ఇతన్నేనా మిస్టరీ స్పిన్నర్ అంటూ దాచారు, తనకంటే పదో క్లాస్ పిల్లలే నయం... పాక్ మాజీ పేసర్ కామెంట్స్...

అతిపెద్ద వయసులో టెస్టుల్లో సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా, విదేశాల్లో సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అజయ్. అయితే కొన్నాళ్లకే గాయం కారణంగా జట్టుకి దూరం కావడంతో అతని స్థానంలో పార్థివ్ పటేల్, టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు...

99 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన అజయ్ రత్రా, 8 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో కలిపి 4029 పరుగులు చేశాడు. 2015లో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన అజయ్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 233 క్యాచులు అందుకున్నాడు. 

Read this ALSO: రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే, ఈపాటికి ఎలా... పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై విరాట్ ఫ్యాన్స్...

బ్యాటింగ్ కోచ్ పదవిలో మాత్రం విక్రమ్ రాథోడ్ కొనసాగే అవకాశం ఉంది. అయితే మరోసారి దరఖాస్తు సమర్పించి, ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది... రాహుల్ ద్రావిడ్, భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటే, ఎన్‌సీఏ డైరెక్టర్‌గా భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం...

READ: పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని అలా పిలుస్తూ అభిమానుల గోల... సానియా మీర్జా రియాక్షన్ చూస్తే...