Rahul Dravid: ఐపీఎల్‌లో ఆ జట్టుకు మెంటార్‌గా  ద్రవిడ్.. టీమిండియా హెడ్ కోచ్ ఎవరంటే..? 

Rahul Dravid: రెండేళ్ల పాటు భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్  వన్డే ప్రపంచకప్‌ 2023 పూర్తయ్యే నాటికి పూర్తయింది. ఇలాంటి పరిస్థితుల్లో ద్రవిడ్‌ తన కాంట్రాక్ట్‌ పొడిగిస్తారా? లేక వేరే జట్టులో చేరాడా? అనే ఉత్కంఠ నెలకొంది.

Rahul Dravid likely to be named as Lucknow Super Giants mentor ahead of IPL 2024 KRJ

Rahul Dravid: వన్డే ప్రపంచకప్‌ 2023 పూర్తయ్యే నాటికి భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒప్పందం కూడా పూర్తయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మూడు విషయాలపై ఉత్కంఠ నెలకొంది. ముందుగా రాహుల్ తన కాంట్రాక్ట్ పొడిగిస్తారా? రెండవది.. ద్రవిడ్ కాకపోతే టీమ్ ఇండియా కోచ్ ఎవరు? మూడోది.. టీమిండియాకు కాకపోతే ఏ జట్టులోకి ప్రాధాన్యత ఇవ్వనున్నారు?  అయితే.. ఇప్పుడు రెండు విషయాలకు సమాధానం దొరికినట్లుంది. ఈ ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకదానిలో రాహుల్ ద్రవిడ్ చేరవచ్చని మీడియాలో వార్తలు వచ్చాయి.

భారత జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ సరేనంటే బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించే అవకాశముంది. కానీ,ద్రవిడ్ కు ఈ పదవిలో కొనసాగేందుకు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బీసీసీఐ, ద్రవిడ్ కు మధ్య ఇంకా సమావేశం జరగాల్సి ఉంది. ఇదిలాఉంటే.. గత రెండు ఐపీఎల్‌ సీజన్లలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్న గౌతమ్‌ గంభీర్ తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు వెళ్లడంతో ఎల్‌ఎస్‌జీలో మెంటార్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో గంభీర్‌ స్థానంలో ద్రవిడ్‌ను మెంటార్‌గా నియమించుకునేందుకు లఖ్‌నవూ యాజమాన్యం ఆసక్తి చూపుతునట్లు, రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌తో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  నివేదికల ప్రకారం.. రాహుల్ ద్రవిడ్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాడు. భారత జట్టు బిజీ షెడ్యూల్ కారణంగా కుటుంబ సమయాన్ని వెచ్చించలేకపోతున్నాడు. అందుకే ద్రవిడ్ ఇప్పుడు కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీల వైపు చూస్తున్నాడు.  

టీమ్ ఇండియా కొత్త కోచ్ గా వీవీఎల్ లక్ష్మణ్ 

రాహుల్ ద్రవిడ్ తర్వాత మాజీ వెటరన్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ ఇండియా కొత్త కోచ్‌గా మారనున్నాడని వార్తలు వెలువడుతున్నాయి.  ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టుకు కోచ్‌గా కూడా లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు 2 వికెట్ల తేడాతో కంగారూలపై ఆసక్తికరమైన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు సిరీస్‌లోని తదుపరి మ్యాచ్ ఆదివారం నవంబర్ 26న జరగనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios