150 పరుగుల అతి స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దాన్ని ఛేదించలేక చతికిల పడింది.  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయింది. కేవలం 145 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయ్యింది. 

వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్లో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా టి20 మొదటి మ్యాచ్ లో ఘోరంగా విఫలమయ్యింది. టీమిండియా వెస్టిండీస్ తో మొదలైన టి 20 సిరీస్ ను ఓటమితో ప్రారంభించింది. ఈ సిరీస్ ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ విండీస్ తో జరిగిన తొలి టీ 20లో నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది . 150 పరుగుల అతి స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దాన్ని ఛేదించలేక చతికిల పడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయింది. కేవలం 145 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయ్యింది.

అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా ఓ సంఘటన జరిగింది. దానికి సంబధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వెస్టిండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో భారత్ చివరి ఓవర్ లో 10 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉంది. విండీస్ బౌలర్ రొమారియో షెఫెర్డ్ వేసిన తొలి బంతిని ఆడే క్రమంలో కుల్ దీప్ యాదవ్ బౌల్డ్ అయి ఎనిమిదో వికెట్ రూపంలో పెవిలియన్ కి చేరాడు.

దీంతో ఐదు బంతుల్లో 10 పరుగులుగా విజయసమీకరణనం మారింది. కుల్ దీప్ అవుట్ కావడంతో అతని స్థానంలో తొలుత యజ్వేంద్ర చాహల్ మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే, కెప్టెన్ హార్దిక్ పాండ్య, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం చాహల్్ కు బదులు ముకేష్ కుమార ను పంపించాలని అనుకున్నారు.

Scroll to load tweet…

అదే విషయాన్ని ఉమ్రాన్ మాలిక్ ద్వారా చాహల్ కు చెప్పారు. ఆ వెంటనే చాహల్ తిరిగి డగౌట్ వైపు వెళ్తుండగా, అంపైర్లు అతనిని పిలిచారు. ఒక్కసారి మైదానంలోకి వచ్చాక తర్వాత అలా వెళ్లకూడదు అని, అది రూల్స్ కి విరుద్దం అని మళ్లీ చాహల్ ని క్రీజులోకి పంపించారు. మరో ఎండ్ లో అర్ష్ దీప్ కూడా అవుట్ కావడంతో ముకేష్ బ్యాటింగ్ కు దిగాడు. చివరికి ముకేష్, చాహల్ ఒక్కో పరుగు చేసి నాటౌట్ గా నిలిచారు. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కన్ఫ్యూజ్ కారణంగానే ఇలా జరిగిందని, అది కూడా మ్యాచ్ ఓడిపోవడానికి కారణం అంటూ పలువురు విమర్శిస్తున్నారు.