బౌల‌ర్ల‌ను ఉతికిపారేసిన యంగ్ ప్లేయ‌ర్.. 50 బంతుల్లోనే సెంచ‌రీ

AFG vs UAE, 1వ T20I: యూఏఈపై ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రహ్మానుల్లా గుర్బాజ్ కేవలం 50 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. 72 ప‌రుగుల తేడాతో జ‌ట్టు విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. 
 

Rahmanullah Gurbaz becomes third player to score a century in T20Is for Afghanistan RMA

Rahmanullah Gurbaz: ఆఫ్ఘనిస్తాన్ , యూఏఈ జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసం సృష్టించాడు. బౌల‌ర్ల‌ను ఉతికిపారేస్తూ కేవ‌లం 50 బంతుల్లో 7 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. గుర్బాజ్ తో పాటు ఇబ్రహీం జద్రాన్ 43 బంతుల్లో 59 పరుగులతో రాణించాడు. 

అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీ

రహ్మానుల్లా గుర్బాజ్ 50 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్ లో అతడికిది తొలి సెంచరీ. ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లో సెంచరీ చేసిన మూడో బ్యాట్స్ మన్ గా గుర్బాజ్ నిలిచాడు. అలాగే, యూఏఈపై టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా నిలిచాడు. కొన్ని నెలల క్రితం యూఏఈతో జరిగిన టీ20లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఒమన్ ఆటగాడు అకిబ్ ఇలియాస్ 52 బంతుల్లో 90 పరుగుల రికార్డును సైతం బ్రేక్ చేశాడు.

 

 

ఐపీఎల్ లో కేకేఆర్ జ‌ట్టులో ర‌హ్మానుల్లా గుర్బాజ్

ఐపీఎల్ 2024 వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఐపీఎల్ 2023 సీజన్ లో గుర్బాజ్ ను రూ.50 లక్షలకు కేకేఆర్ తమ జట్టులో చేర్చుకుంది. ఇప్పుడు రాబోయే ఐపీఎల్ సీజన్ లో కూడా కేకేఆర్ తరఫున ఆడనున్నాడు. ఐపీఎల్ 2023లో అరంగేట్రం చేసిన రహ్మానుల్లా గుర్బాజ్ 11 మ్యాచ్ ల‌లో 227 పరుగులు చేశాడు. ఒక ఇన్నింగ్స్ 81 ప‌రుగుల‌తో అద‌ర‌గొట్టాడు. ఈ సీజన్లో 15 సిక్సర్లు కూడా బాదాడు. జట్టుకు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా కీల‌క పాత్ర పోషించాడు.

`డెవిల్‌` డైరెక్టర్‌ వివాదం వెనుక అసలు కథ ఇదే?.. కళ్యాణ్‌ రామ్‌ ఈగో దెబ్బతిన్నదా?..ప్రొడ్యూసర్‌

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios