Asianet News TeluguAsianet News Telugu

ధోనీ కన్నీళ్లు పెట్టుకున్నాడు.. అశ్విన్

తన చివరి టెస్టు మ్యాచ్ ఆడిన రాత్రి ధోనీ జెర్సీ కూడా విప్పలేదని అశ్విన్ చెప్పాడు

R Ashwin shares his memories with MS Dhoni
Author
Hyderabad, First Published Aug 19, 2020, 12:07 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్ కి తాజాగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా.. చివరి మ్యాచ్ రోజు ధోనీ ఏం చేశాడు అనే విషయాన్ని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా వెల్లడించారు. 

తన చివరి టెస్టు మ్యాచ్ ఆడిన రాత్రి ధోనీ జెర్సీ కూడా విప్పలేదని అశ్విన్ చెప్పాడు. ‘మెల్‌బోర్న్‌లో టెస్టు ఓడిపోయాం. ధోనీ ఏం మాట్లాడలేదు. కేవలం ఓ స్టంప్ తీసుకొని వచ్చేశాడు. ఆ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అది ధోనీకి చాలా ఎమోషనల్ మూమెంట్’ అని అశ్విన్ గుర్తుచేసుకున్నాడు. ఆరోజు రాత్రి ధోనీ తన టెస్టు జెర్సీని విప్పలేదని, కన్నీళ్లు పెట్టుకున్నాడని తెలియజేశాడు.

కాగా.. ధోనీ ఇటీవల ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతకాలం తనకు మద్ధతు తెలిపిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపాడు.

2004 డిసెంబర్ 23న వన్డేల్లో అరంగేట్రం చేసిన ధోనీ.. కెప్టెన్‌గా భారత్‌కు వన్డే, టీ 20 ప్రపంచకప్‌లు అందించాడు. గతంలోనే టెస్టుల నుంచి తప్పుకున్న మహీ.. వన్డే, టీ20లలో కొనసాగుతున్నాడు.

బ్యాట్‌తో ఎంత బలంగా బాదొచ్చో ప్రపంచ క్రికెట్‌కు రుచి చూపించాడు ఈ జార్ఖండ్ డైనమైట్. 350 వన్డేల్లో ధోనీ 10,773 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 73 అర్ధసెంచరీలున్నాయి.

టెస్టు కెరీర్‌లో 6 సెంచరీలుు, 33 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇండియన్ క్రికెట్‌‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా కిర్తీ గడించాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో సిక్స్‌తో ఫినిషింగ్ షాట్ కొట్టి ఆయన అభిమానులను అలరించాడు.

98 టీ 20లు, 90 టెస్టులు ఆడాడు. వన్డేల్లో ధోనీ అత్యధిక స్కోరు 183 పరుగులు. 2007లో రాజీవ్ ఖేల్‌రత్న, 2009లో పద్మశ్రీ, 2018లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నాడు. 2008, 2009లలో ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios