Asianet News TeluguAsianet News Telugu

నికోలస్ పూరన్‌... నీకు హ్యాట్సాఫ్... దేశంలో పరిస్థితిని చూసించి చలించి, ఐపీఎల్ శాలరీలో...

దేశంలో కరోనా విలయతాండవాన్ని చూసి చలించిపోయిన పంజాబ్ కింగ్స్ ప్లేయర్ నికోలస్ పూరన్...

ఐపీఎల్ ద్వారా తనకి వచ్చే ఆదాయంలో కొంత భాగం విరాళంగా ఇవ్వబోతున్నట్టు ప్రకటన...

Punjab Kings Player nicholas pooran donated part of his ipl salary for Covid Relief CRA
Author
India, First Published Apr 30, 2021, 3:50 PM IST

నికోలస్ పూరన్... ఐపీఎల్ 2021 సీజన్‌లో మూడు సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్. ఈ విండీస్ భారీ హిట్టర్ మీద ఉన్న నమ్మకంతో అతనికి వరుస అవకాశాలు ఇస్తున్నాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్. క్రికెట్ పర్ఫామెన్స్ గురించి పక్కనబెడితే, తన దాయర్థ హృదయంతో క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రజల మన్ననలు గెలుచుకున్నాడు నికోలస్ పూరన్.

దేశంలో కరోనా విలయతాండవాన్ని చూసి చలించిపోయిన నికోలస్ పూరన్, ఐపీఎల్ ద్వారా తనకి వచ్చే ఆదాయంలో కొంత భాగంగా విరాళంగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు.

ఐపీఎల్ ద్వారా నికోలస్ పూరన్‌కి ఏటా రూ.4 కోట్ల 20 లక్షలు పారితోషికంగా అందుతోంది. ఇందులో పావు వంతు విరాళంగా ఇచ్చిన చాలామంది భారత క్రికెటర్ల కంటే ఎక్కువే ఇచ్చినట్టు అవుతుంది. జనాల్లో అవగాహన కల్పించేందుకు తాను ముందుకొస్తానని చెప్పిన నికోలస్ పూరన్, మిషన్ ఆక్సిజన్ కోసం కోటి రూపాయల విరాళం అందించిన సచిన్ టెండూల్కర్‌కి ధన్యవాదాలు తెలుపడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios